ఎన్నికల సన్నాహాల్లో వేగం పెంచిన టీడీపీ -జనసేన..!

ఏపీలో ఎన్నికలు( AP Elections ) రానున్న నేపథ్యంలో టీడీపీ, జనసేన( TDP, Janasena ) సీట్ల సర్దుబాటుపై ప్రత్యేక దృష్టి సారించాయి.

ఎన్నికల సన్నాహాల్లో వేగం పెంచిన రెండు పార్టీలు సీట్ల సర్దుబాటుపై ఉమ్మడి ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ మేరకు వచ్చే నెల మొదటివారంలో అభ్యర్థుల జాబితాపై ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.

అయితే పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు వ్యవహారంపై ఇప్పటికే చంద్రబాబు,( Chandra Babu ) పవన్ కల్యాణ్( Pawan Kalyan ) రెండు సార్లు కీలక భేటీలు నిర్వహించారు.

"""/" / ఈ క్రమంలోనే మరోసారి ఇరు పార్టీ పెద్దలు సమావేశం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

ప్రస్తుతం హైదరాబాద్ లో( Hyderabad ) ఉన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ వచ్చే రెండు రోజులు సీట్ల సర్దుబాటుపై ఫోకస్ పెట్టనున్నారని సమాచారం.

అలాగే ఉమ్మడి మ్యానిఫెస్టో రూపకల్పనపై కూడా కసరత్తు చేయనున్నారు.అయితే సీట్ల సర్దుబాటు వ్యవహారం నేపథ్యంలోనే చంద్రబాబు రా కదలి రా సభలకు విరామం ప్రకటించారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి20, సోమవారం2025