సర్వేల రాజకీయం ! ఏపీలో గెలవబోయేది వీరేనట ? 

ప్రస్తుతం వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతోంది.మొదటి తో పోలిస్తే జగన్ గ్రాఫ్ కొంతమేర తగ్గింది.

వరుసగా సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ భారీగా లబ్ది చేకూరుస్తున్నారు .ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తోంది.

ఆ చిన్నపాటి వ్యతిరేకతను హైలెట్ చేసుకుంటూ టిడిపి, ఆ పార్టీకి అనుకూల మీడియా ఇప్పుడు అదే పనిగా వైసీపీ ప్రభుత్వం పని అయిపోయిందని, ఇక ఆ పార్టీ అధికారంలోకి రాలేదని , మళ్లీ 150 సీట్ల తో తామే అధికారంలోకి వస్తామని, టిడిపి హడావుడి మొదలుపెట్టింది.

గత కొద్ది రోజులుగా ఈ తరహా వ్యవహారం ఊపందుకుంది. అయితే నిజంగానే టిడిపికి అంత ఊపు వచ్చిందా ? వైసిపి ప్రభుత్వంపై వ్యతిరేకత  ఉందంటూ వివిధ సర్వేలు రిపోర్టులను చూపిస్తున్నారు.

అయితే మొత్తం టిడిపి యాప్ లోనూ, టిడిపి అనుకూలం మీడియాలో చేపట్టిన డిజిటల్ సర్వే ద్వారా ను బయటకు వచ్చినవి కావడంతో అనేక అనుమానాలు ఉన్నాయి.

ఇటీవల ఇండియా టుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే లో జగన్ కు ర్యాంకు తక్కువగా ఇవ్వడాన్ని అవకాశంగా తీసుకుని, ఈ సర్వే లకు టిడిపి దిగినట్టుగా కనిపిస్తోంది.

ఇకపై వారానికి ఒక సర్వే రిజల్ట్ విడుదల చేస్తూ, వైసీపీ ప్రభుత్వం కు ప్రజల్లో ఆదరణ తగ్గుతోంది అనే విషయాన్ని హైలెట్స్ చేసేందుకు టిడిపి ప్రయత్నాలు మొదలు పెట్టింది.

  """/"/  ఇక వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సైతం తాను ఓ సర్వే చేయించాను అని, వైసీపీకి 50 సీట్లు రావని,  నర్సాపురంలో ఎంపి స్థానానికి తాను జగన్ పోటీ చేస్తే విజయం సాధిస్తాను అని రఘురామ చెబుతుండడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.

అయితే ఆ సర్వేలకు ఉన్న ప్రామాణికం ఎంత అనేది తేలాల్సి ఉంది.ఒకరకంగా ఏపీలో జగన్ గాలి తగ్గిందని,  టిడిపి బాగా బలం పొందుతుంది అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు సర్వేలను అడ్డంపెట్టుకుని ఈ విధమైన ఈ ప్రచారానికి దిగుతున్నారు అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.

ఏదేమైనా అంత ఆషామాషీగా సర్వే రిపోర్ట్ ను నమ్మి ప్రభుత్వ తీరును అంచనా వేసే స్థితిలో అయితే ఇప్పుడు జనాలు లేరు.

వారిలో చైతన్యం బాగానే కనిపిస్తోంది.

మోసగాడితో ప్రేమలో పడ్డ చైనా మహిళ.. చివరికి ఎంత నష్టపోయిందో తెలిస్తే…?