టీడీపీ డబ్బు రాజకీయాలు చేస్తోంది..: విజయసాయి రెడ్డి

వైసీపీ నేత విజయసాయి రెడ్డి( Vijaysai Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.

నెల్లూరు జిల్లాలో టీడీపీ డబ్బు రాజకీయాలు చేస్తోందని ఆయన ఆరోపించారు.ముస్లింలు, క్రైస్తవుల మనోభావాలను టీడీపీ దెబ్బతీస్తోందని విజయసాయి రెడ్డి విమర్శించారు.

ఈ క్రమంలో టీడీపీకి ఓటు వేస్తే వారి మతవిశ్వాసాలకు వారే ద్రోహం చేసుకున్నట్లు అవుతుందని తెలిపారు.

బీజేపీ( BJP ) అధికారంలోకి వచ్చిన తరువాత యూసీసీ తెస్తామంటోందన్న విజయసాయి రెడ్డి యూసీసీపై మైనార్టీలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

లేదంటే మైనార్టీలకు అన్యాయం చేసినట్లు అవుతుందని వెల్లడించారు.

ఏపీకి అమరావతి రాజధాని మాత్రమే కాదు అంటూ చంద్రబాబు సంచలన పోస్ట్..!!