టీడీపీ గురించి జగన్ పార్టీలో జోరుగా చర్చ నడుస్తుందట.. ఎందుకంటే?

ఏపీ రాజకీయాలు మరో కొత్త చర్చకు దారి తీశాయి.ఇన్నిరోజులు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీ నేతల మధ్య యుద్ధవాతావరణం కనిపించింది.

కానీ ఒక్కసారిగా అక్కడ అంతా సైలెంట్ అయ్యింది.అయితే, అధికార వైసీపీ పార్టీలో ప్రతిపక్ష పార్టీపై జోరుగా చర్చ నడుస్తుందని తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రతీ కదలికను వైసీపీ నేతలు నిశితంగా గమనిస్తున్నారట.

మొన్న అసెంబ్లీలో జరిగిన అవమానంతో చంద్రబాబు సీఎం అయ్యాకే ఈ సభలో అడుగుపెడతానని శపథం చేసి బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

అయితే, రాబోయే ఎన్నికల కోసం బాబు ఎటువంటి వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారని, ఎవరెవరిని కలుస్తున్నారో తెలుసుకుని చర్చలు సాగిస్తున్నారని తెలుస్తోంది.

అమరావతి మహోద్యమ సభ తిరుపతిలో భారీగా జరిగింది.దానికి వైసీపీ పార్టీ మినహా అన్ని పార్టీల నేతలు, అన్ని ప్రాంతాల నాయకులు హాజరయ్యారు.

ప్రజా రాజధానిగా అమరావతినే ఉంచాలని అందరూ ఆమోదించారు.అయితే, ఈ విషయాన్ని చంద్రబాబు సభపై నేరుగా ప్రకటించకుండా పక్కనే ఉన్నా బీజేపీ లీడర్ కన్నా లక్ష్మినారాయణను దగ్గరకు రమ్మని పిలిచి ఏదో మాట్లాడాలని  వైసీపీ నేతలు కొత్త చర్చకు తెరలేపారు.

2024 ఎన్నికల కోసం బాబు మరోసారి మహాకూటమి కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు కావొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో లాగా జనసేన, బీజేపీ, టీడీపీ పార్టీలు మళ్లీ పొత్తు పెట్టుకుంటే వైసీపీ పాలనతో విసుగు చెందిన ప్రజలు తప్పకుండా కూటమి వైపు చూస్తారు.

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు అంటూ ఎవరూ ఉండరనేది ఒక నానుడి.

"""/" / దీని ప్రకారం.గతంలో చంద్రబాబు బీజేపీ, జనసేనను అధికారంలోకి వచ్చాక పక్కన పెట్టారు.

2024 ఎన్నికల్లో చంద్రబాబు సీఎం కాలేకపోతే ఆయన చేసిన శపథం వృథాగా పోతుంది.

అంతేకాకుండా ప్రతిపక్ష హోదాలో మరోసారి వైసీపీ నేతలతో మాటలు పడేందుకు ఆయన సిద్ధంగా లేరని తెలుస్తోంది.

ఇప్పటికే బాబుకు వయస్సు మీద పడింది.వచ్చే ఎన్నికల్లో అవకాశం మిస్ అయితే ఆ తర్వాత టీడీపీని మళ్లీ గాఢిన పెట్టేందుకు టీడీపీ సరైన లీడర్ కూడా లేడు.

చంద్రబాబు మహాకూటమి పెడితే వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న బలమైన వర్గం టీడీపీ వైపు చూస్తుంది.

దీంతో వైసీపీకి గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంది.అందుకే వైసీపీ నేతలు చంద్రబాబు, టీడీపీ పార్టీ చర్యలపై జోరుగా చర్చకు తెరలేపారట.

చైనాలో విజయ్ సేతుపతి మూవీ కలెక్షన్ల సునామీ.. తొలి రోజే అన్ని రూ.కోట్లా?