మునుగోడు లో టీడీపీ ? ఆ టీఆర్ఎస్ నేతకు గాలం ?

త్వరలో జరగబోతున్న మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల తంతు హారాహోరీగా జరిగేలా కనిపిస్తోంది.

ప్రధాని పార్టీలైన కాంగ్రెస్, బిజెపి,  టిఆర్ఎస్ తో పాటు,  ప్రజాశాంతి పార్టీ సైతం తమ అభ్యర్థిగా గద్దర్ పేరును తెరపైకి తీసుకొచ్చింది.

దీంతో ఇక్కడ ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ తెలంగాణతో పాటు , మిగిలిన రాష్ట్రాల్లోనూ మొదలైంది.

ఇది ఇలా ఉంటే టిడిపి సైతం ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థిని నిలబెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.

ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ మొదలవడంతో,  ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది.కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి పోటీ చేస్తుండగా,  బిజెపి నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,  టిఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు.

కాంగ్రెస్ సిట్టింగ్ స్థానమైన మునుగోడు మళ్ళీ తమ ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుండగా , బిజెపి నుంచి గెలిచి తన సత్తా చాటుకోవాలని రాజగోపాల్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు .

   ఇక అధికార పార్టీ టిఆర్ఎస్ కూసుగుంట్ల ప్రభాకర్ రెడ్డి ని తెరపైకి తీసుకువచ్చి,  ఈ నియోజకవర్గంలో గెలిచి రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ కు తిరుగులేదు అని నిరూపించుకోవాలని చూస్తోంది.

అయితే టిడిపి ఈ నియోజకవర్గంలో అభ్యర్థిని నిలబెట్టి గెలిచి తెలంగాణలో తమ ఉనికి కాపాడుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది.

దీనిలో భాగంగానే టిఆర్ఎస్ తరఫున టికెట్ ఆశించి భంగపడ్డ సీనియర్ నాయకుడు,  మాజీ ఎంపీ బూరా నర్సయ్య గౌడ్ తో చంద్రబాబు సంప్రదింపులు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది .

బురా నరసయ్య గౌడ్ టిడిపిలో చేరితే వెంటనే ఆయనకు బీఫామ్ అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం.

బూర నర్సి గౌడ్ బీసీ సామాజిక వర్గానికి చెందినవారు కావడం,  ఈ నియోజకవర్గంలో బీసీల సంఖ్య ఎక్కువగా ఉండడం ,  ప్రధాన పార్టీలన్నీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారిని పోటీకి దించడంతో,  ఈ సమీకరణాలు తమకు కలిసి వస్తాయని లెక్కల్లో తెలంగాణ టిడిపి ఉంది.

  """/" /   కాకపోతే  బూర నర్సయ్య గౌడ్ టిడిపిలో చేరేందుకు సముకత వ్యక్తం చేయకపోతే .

మరో అభ్యర్థిని ఆగమేగల మీద రంగంలోకి దించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపైన టిడిపి దృష్టి సారించింది.

ఏది ఏమైనా టిడిపి అభ్యర్థిని బరిలోకి దింపాలని ఆలోచనలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఉన్నట్లు సమాచారం.

ఆ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.

ఆర్లింగ్టన్ స్మశాన వాటికకు ట్రంప్.. అది పొలిటికల్ స్టంటేనన్న కమలా హారిస్