టీడీపీ త్యాగం చేయాల్సిందే … పవన్ ‘ లెక్క ‘ ఇదే ?

టీడీపీ త్యాగం చేయాల్సిందే … పవన్ ‘ లెక్క ‘ ఇదే ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )కూడా ఎన్నికల వ్యూహాల్లో బాగా ఆరితేరిపోయారు.

టీడీపీ త్యాగం చేయాల్సిందే … పవన్ ‘ లెక్క ‘ ఇదే ?

టిడిపి తో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో ఆ పార్టీ ఇచ్చే అరకొర సీట్లతో సరిపెట్టుకునేందుకు పవన్ ఏ మాత్రం ఇష్టపడడం లేదు.

టీడీపీ త్యాగం చేయాల్సిందే … పవన్ ‘ లెక్క ‘ ఇదే ?

త్యాగం అంటే రెండు వైపుల నుంచి ఉండాలని జనసేన ఒకటే త్యాగం చేసి టిడిపికి మేలు కలిగేలా చేస్తే అది  కరెక్ట్ కాదని , టిడిపి కూడా త్యాగానికి సిద్ధపడాల్సిందే అనే విధంగా పవన్ ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరు కనిపిస్తోంది .

ప్రస్తుతం జనసేన బలంగా ఉన్న నియోజకవర్గల్లో అభ్యర్థులు ఎంపికైన దృష్టి సారించారు.ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేకంగా ఫోకస్ చేశారు.

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అనేక సర్వేలు చేయించుకున్నారు.ఈ సర్వేలో జనసేన బలంగా ఉన్న నియోజకవర్గాలు ఏమిటి? ఏ నియోజకవర్గంలో ఎవరిని అభ్యర్థిగా దించాలి అనే విషయాలపై సర్వే చేయించారు.

ఈ సర్వే నివేదిక ఆధారంగా ప్రస్తుతం అభ్యర్థుల ఎంపిక,  నియోజకవర్గాల గుర్తింపు పై కసరత్తు మొదలు పెట్టారు .

"""/" / టిడిపి( TDP ) పొత్తులో భాగంగా 20 సీట్లు మాత్రమే జనసేనకు కేటాయించే ఆలోచనతో ఉండడంతో, తాము ఏ స్థాయిలో బలంగా ఉన్నామో  నిరూపించుకునేందుకు పవన్ సిద్ధం అవుతున్నారు.

ఈనెల 14 నుంచి అభ్యర్థుల ఎంపిక పై దృష్టి సాధించారు.  అయితే ఇది మొదటి విడత మాత్రమే అని , దాదాపు 50 స్థానాల్లో అభ్యర్థులను పోటీకి దించే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే 20 నియోజకవర్గాలకు సంబంధించి కసరత్తు పూర్తవడంతో,  మరో 30 స్థానాల పైనా పవన్ దృష్టి సాధించారట.

"""/" / టిడిపి పొత్తులో భాగంగా 20 స్థానాలతో సరిపెడితే కుదరదని, త్యాగం అంటే ఇరు  వైపుల నుంచి ఉండాలని, జనాసేన( Jana Sena ) మాత్రమే త్యాగానికి సిద్ధం అయితే అది పొత్తు ధర్మం కాదు అని,  టీడీపి కూడా త్యాగం చేయాల్సిందే.

అన్న లెక్క లో.పవన్ ఉన్నారు.

అందుకే జనసేన బలం ఏంటో టిడిపి కి అర్ధం అయ్యేలా చేసి , పొత్తులో భాగంగా వీలైనన్ని ఎక్కువ సీట్లు తీసుకోవాలి అని , ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదనే లెక్కల్లో పవన్ ఉన్నారట .

అతడితో నా అనుబంధానికి పేరు పెట్టలేను.. సమంత సంచలన వ్యాఖ్యలు వైరల్!