వ్యవసాయంపై మాట్లాడే అర్హత టీడీపీకి లేదు.. మంత్రి కాకాణి

టీడీపీ నేత నారా లోకేశ్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్రకు స్పందన లేదని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు.

వ్యవసాయం గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదని తెలిపారు.టీడీపీ ప్రభుత్వ హయాంలో నాసిరకం ఎరువులు, విత్తనాలు విక్రయించారని మంత్రి కాకాణి ఆరోపించారు.

అధికారంలో ఉన్నప్పుడు రైతు సంక్షేమం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.రుణమాఫీ పేరుతో రైతులను చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు.

కోర్టు చోరీ ఎఫ్ఐఆర్ లో తన పేరు లేదన్న ఆయన ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికారని గుర్తు చేశారు.

ఆ ఇద్దరు స్టార్ హీరోలు డైరెక్టర్లకు సరెండర్ అయితేనే వాళ్ళకి సూపర్ సక్సెస్ లు వస్తాయా..?