ఢీలా పడుతున్న టీడీపీ ... పట్టు పెంచుకుంటున్న వైసీపీ
TeluguStop.com
రాజకీయ పార్టీలు ఎప్పుడూ ఒకటే వ్యూహంతో ముందుకు వెళ్తుంటాయి.అధికారమే తమ అంతిమ లక్ష్యంగా.
రకరకాల హామీలు .ఎత్తుగడలతో వ్యూహాత్మకంగా ఎన్నికల బరిలోకి వెళ్లేందుకు సిద్ధం అవుతుంటాయి.
ఏపీలో ప్రస్తుతం ఎన్నికల సీజన్ కావడంతో.రాజకీయ పార్టీలు ఈ విధంగానే తమ కార్యాచరణ రూపొందించుకుని అందుకు తగ్గట్టుగా ముందుకు వెళ్తున్నాయి.
ఇక ఏపీ అధికార పార్టీ టీడీపీ విషయానికి వస్తే.అధికార పార్టీ టీడీపీ ప్రజలపై వరాల వర్షం కురిపిస్తోంది.
ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో తమదే విజయమని టీడీపీ అధినేత చంద్రబాబు ధీమాగానే ఉన్నారు.
అయితే, క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడంలేదు.ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు ఊహించినంత స్థాయిలో అయితే క్రేజ్ ఉన్నట్టు కనిపించడంలేదు.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ టీడీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి.ఈ విషయాన్ని చంద్రబాబు కూడా ఒప్పుకొంటున్నారు.
తాను ఎన్ని చేస్తున్నా.ఎన్ని చెబుతున్నా పార్టీ నేతలు మారడం లేదు.
నాయకులు ఇదే విధంగా ముందుకు వెళ్తే చిక్కులు తప్పవని బాబు ఆందోళన చెందుతున్నాడు.
అదే సమయం లో పార్టీ తరఫున ప్రవేశ పెడుతున్న కార్యక్రమాలు కానీ, ప్రభుత్వం తరఫున అమలు చేస్తున్న కార్యక్రమాలు కానీ ప్రజల్లోకి అనుకున్నంత స్థాయిలో వెళ్లడంలేదు.
దీంతో ఆయా నియోజకవర్గాల్లో టీడీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి.బాబు అంతర్గతంగా చేయించిన సర్వేల్లోనూ.
ఇంటలిజెన్స్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా టీడీపీకి వ్యతిరేక గాలి ఉన్నట్టే స్పష్టం చేస్తున్నాయి.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
ప్రజల్లో మరింత చొచ్చుకెళ్లేందుకు చంద్రబాబు కొత్త కొత్త పథకాలు ప్రవేశపెడుతున్నా.
బాబు ఎత్తులు పారడం లేదు.చంద్రబాబు పరిస్థితిని ప్రజలు ఎవరూ అర్ధం చేసుకునే పరిస్థితిలో కనిపించడంలేదు అన్నట్టుగా పరిస్థితి కనిపిస్తోంది.
సీనియర్ పొలిటిషన్ గా చంద్రబాబు మీద ప్రజలకు అభిమానం ఉంది.కాకపోతే స్థానికంగా నాయకులపై ఉన్న అసంతృప్తి.
అవినీతి తదితర కారణాలతో.ప్రజలు బాగా విసిగిపోయినట్టు కనిపిస్తున్నారు.
అంతే కాదు ప్రస్తుతం ఏపీలో వైసీపీ కూడా సైలెంట్ గానే ఉన్నట్టు కనిపిస్తున్నా.
తెర వెనుక చేయాల్సిన తతంగం అంతా చేస్తూనే ఉంది.ఇప్పటికే పాదయాత్ర కూడా కంప్లీట్ అవ్వడంతో .
ప్రజల్లోకి మరోసారి బస్సు యాత్ర చేపట్టి సుడిగాలి పర్యటన చేయాలని జగన్ ఆలోచన చేస్తున్నాడు.
వైసీపీ గాలి ఎక్కువగా వీస్తుండడం టీడీపీ కి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.
డాకు మహారాజ్ ట్రైలర్ రిలీజ్ అప్పుడేనట.. గేమ్ ఛేంజర్ ను మించి బాలయ్య మెప్పిస్తాడా?