టీడీపీకి భవిష్యత్తు ఆరు నెలల్లోనే తేలిపోనుందా… 2024 వరకు అక్కర్లేదు…!
TeluguStop.com
త్వరలో జరిగే తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలు టీడీపీకి, ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి.
టీడీపీ పుట్టినప్పటి నుంచి నేటి వరకు ఎప్పుడూ ఎదుర్కొనంత గడ్డు పరిస్థితి ప్రస్తుతం ఎదుర్కోంటోంది.
గత ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత పార్టీకి భవిష్యత్తు ఉందా ? అన్న సందేహాలు సొంత పార్టీ నేతల నుంచే వ్యక్తమవుతున్నాయి.
తిరుపతి ఉప ఎన్నికల్లో గెలుపు లేదా భారీగా ఓట్లు రాబట్టి వైసీపీకి పోటీ ఇవ్వడంపైనే ఆ పార్టీకి భవిష్యత్తు ఉందా ? లేదా ? అన్నది తేలిపోనుంది.
మొన్నటి గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీకి 106 సీట్లలో పోటీ చేసి చిత్తుగా ఓడినా ఎవ్వరికి అభ్యంతరాలు లేవు.
ఎందుకంటే తెలంగాణలో పార్టీ బతుకుతుందన్న ఆశలు ఎవ్వరికి లేవు.అదే ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న చోట కూడా టీడీపీ పుంజుకోలేకపోతే మాత్రం మరింత మంది నాయకులు ఆ పార్టీని వీడేందుకు సిద్దంగా ఉంటారనే చెప్పాలి.
అందుకే చాలా మంది నేతలు గోడ దూకుదామని రెడీ అయ్యి కూడా తిరుపతి ఉప ఎన్నిక ఫలితం చూశాకే నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు.
"""/"/
తిరుపతి ఉప ఎన్నికల్లో పార్టీ గెలిచినా, లేదా ఘోరంగా ఓడిపోకుండా వైసీపీకి గట్టి పోటీ ఇచ్చినా కొందరు అయినా పార్టీ వీడే నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటారు.
అదే ఘోరంగా ఓడితే మాత్రం టీడీపీలో మరిన్ని వికెట్లు పడడం ఖాయం.అసలు తిరుపతి సీటు టీడీపీకి ఎప్పుడూ అచ్చిరావట్లేదు.
అప్పుడెప్పుడో 1984లో మాత్రమే ఇక్కడ నుంచి టీడీపీ తరపున చింతామోహన్ ఎంపీగా గెలిచారు.
అప్పటి నుంచి ఇక్కడ టీడీపీ ఒక్కసారి కూడా గెలవలేదు.కొన్నిసార్లు పొత్తుల్లో ఇతరులకు వదిలేసినా గెలుపు మాత్రం దక్కలేదు.
గత ఎన్నికల్లోనే పనబాక లక్ష్మీ ఏకంగా 2.28 లక్షల ఓట్ల భారీ తేడాతో ఓడిపోయారు.
కనీసం వచ్చే ఎన్నికల్లో అయినా ఇక్కడ పనబాక గెలవకపోయినా వైసీపీకి చెమటలు పట్టిస్తేనే టీడీపీకి భవిష్యత్తు ఉంటుంది.
లేకపోతే టీడీపీ మరింతగా పతనమవ్వడంతో పాటు ఆ పార్టీ ఫ్యూచర్ డేంజర్లోకి వెళ్లిపోవడం ఖాయం.
పురుషుల్లో స్పెర్మ్ కౌంట్‌ను పెంచే సూపర్ ఫుడ్స్ ఇవే!