అచ్చెన్న శ్రీరామన్న లకు ఆ పదవులంటూ హడావుడి ? 

ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా మాజీమంత్రి, టీడీపీ కీలక నాయకుడు కింజరాపు అచ్చెన్నాయుడు నియామకం త్వరలోనే జరగనుందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతూ వస్తోంది.

ఈ మేరకు చంద్రబాబు సైతం ఆ విధమైన సంకేతాలు ఇచ్చారు.ప్రస్తుతం పార్టీ ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వైసీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కోగల సత్తా అన్నీ అచ్చెన్నకు మాత్రమే ఉన్నాయనేది చంద్రబాబు అభిప్రాయం.

ఏదో ఒక రోజు ఆయన నియామకాన్ని చేపట్టేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే, సోషల్ మీడియాలో మాత్రం టీడీపీ యాక్టివిస్ట్ లు మాత్రం ఈ అంశంపైనే చర్చకు తెరలేపారు.

త్వరలోనే మండల, జిల్లా, కమిటీలను చంద్రబాబు ప్రక్షాళన చేయబోతున్నారని, కొత్తగా కమిటీలను నియమిస్తారని, ఆ తర్వాత  రాష్ట్ర కమిటీ లతో పాటు, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు, తెలుగు యువత అధ్యక్షుడి నియామకాలను చేపడతారని ప్రచారం జరుగుతోంది.

"""/"/ సోషల్ మీడియాలో ఈ మేరకు పోస్టింగ్స్ వైరల్ అవుతున్నాయి.ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన అచ్చెన్నకు టీడీపీ అధ్యక్ష పదవి ఇచ్చి , రాయలసీమ ప్రాంతానికి చెందిన పరిటాల శ్రీరామ్ కు తెలుగు యువత అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగిస్తే, ప్రాంతాల వారీగా సమన్యాయం చేసినట్లవుతుందని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారట.

వాస్తవంగా తెలుగు యువత అధ్యక్షుడిగా ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు పేరు తెరపైకి వచ్చినా, టీడీపీ అధ్యక్ష బాధ్యతలు అచ్చెన్నకు అప్పగించే క్రమంలో ఒకే కుటుంబంలో రెండు పదవులు ఇవ్వడం సరికాదు అనే అభిప్రాయంతో పరిటాల శ్రీరామ్ కి తెలుగుయువత అధ్యక్షుడి పదవి ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

"""/"/ టీడీపీ నుంచి ఈ మేరకు ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది.ప్రస్తుతం ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావు వైసీపీని ఎదుర్కోవడంలో యాక్టివ్ గా ఉండే అవకాశం లేకపోవడంతో, అతని పేరును చంద్రబాబు తెరపైకి తెచ్చారు.

త్వరలోనే పరిటాల శ్రీరామ్ అన్న, అచ్చెన్న టీడీపీని ఏపీలో పరుగులు పెట్టిస్తారు అంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్స్ వైరల్ అవుతున్నాయి.

ఐటీ దాడులపై అనిల్ రావిపూడి సంచలన వ్యాఖ్యలు… వాళ్లు సంక్రాంతికే వచ్చారంటూ?