ఈఎస్ఐ కేసులో మాజీ మంత్రి బెయిల్ పిటీషన్ పై ముగిసిన వాదనలు

ఈఎస్ఐ కేసులో మాజీ మంత్రి బెయిల్ పిటీషన్ పై ముగిసిన వాదనలు

ఈఎస్ఐ స్కాం కేసులో టీడీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఆరోపణలు ఎదురుకొంటున్న సంగతి తెలిసిందే.

ఈఎస్ఐ కేసులో మాజీ మంత్రి బెయిల్ పిటీషన్ పై ముగిసిన వాదనలు

ఈఎస్ఐ లో వైద్య పరికరాలు,మందుల కొనుగోలు కుంభకోణంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆయనను ఇటీవల అరెస్ట్ చేసిన విషయం విదితమే.

ఈఎస్ఐ కేసులో మాజీ మంత్రి బెయిల్ పిటీషన్ పై ముగిసిన వాదనలు

అయితే ఈ కేసుకు సంబంధించి ఆయన బెయిల్ కోరుతూ పిటీషన్ దాఖలు చేయగా దానిపై తాజాగా విచారించిన ఏపీ హైకోర్టు ఇరు పక్షాల వాదనలు విని తీర్పును రిజర్వ్ లో పెట్టినట్లు తెలుస్తుంది.

ఈఎస్‌ఐలో వైద్య పరికరాలు, మందుల కొనుగోలు కుంభకోణంలో డీలర్ల నుంచి మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి డబ్బులు చేరినట్లు తమ దర్యాప్తులో ఎక్కడా బయట పడలేదని ఏసీబీ ఇప్పటికే వెల్లడించింది.

ఆర్థికపరమైన లావాదేవీలపై ఆధారాలు లభించలేదని ఏసీబీ జాయింట్‌ డైరెక్టర్‌ రవికుమార్‌ పేర్కొన్నారు.దీనితో ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు వచ్చే శుక్రవారం తీర్పును వెల్లడించనుంది.

2016-19 మధ్య కాలంలో ఈఎస్‌ఐకి సబంధించి వైద్య పరికరాలు, మందులు, టెలి మెడిసిన్‌ సేవలు తదితరాలపై ఈ-టెండర్లు నిర్వహించకుండా నిబంధనలకు విరుద్ధంగా రూ.

975 కోట్ల విలువైన కొనుగోళ్లు చేపట్టారని చెప్పారు.ప్రభుత్వ ధనం సుమారు రూ.

150 కోట్లు దుర్వినియోగమైందని,ఈ కేసులో చార్జిషీటును త్వరలో దాఖలు చేస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.

ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రి అచ్చెన్నాయుడు,అలానే ఈఎస్ఐ డైరెక్టర్ రమేష్ కుమార్,మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడిపై కూడా అభియోగాలు నమోదు అయ్యాయి.

అయితే గతంలోనే ఈ కేసు లో బెయిల్ కోరుతూ పిటీషన్ దాఖలు చేయగా,దానికి కోర్టు తిరస్కరించింది.

అయితే తాజాగా మరోసారి ఈ కేసు విషయంలో బెయిల్ కోరుతూ అచ్చెన్న పిటీషన్ వేయగా,దీనిపై తీర్పును కోర్టు రిజర్వ్ లో పెట్టింది.

దసరా విలన్ పై మరో నటి ఆరోపణలు.. సెట్ లో అసభ్యంగా ప్రవర్తించారంటూ?

దసరా విలన్ పై మరో నటి ఆరోపణలు.. సెట్ లో అసభ్యంగా ప్రవర్తించారంటూ?