పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు..!!
TeluguStop.com
టిడిపి పార్టీ సీనియర్ నేత మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమ పోలవరం ప్రాజెక్టు కోసం.
భూములు త్యాగం చేసిన నిర్వాసితుల విషయంలో ప్రభుత్వం అలసత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.నిర్వాసితుల త్యాగం వల్లనే.
పోలవరం ప్రాజెక్టు కల నెరవేరుతుందని స్పష్టం చేశారు.ఇటువంటి కీలకమైన ప్రాజెక్టు కోసం త్యాగం చేసిన నిర్వాసితుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం.
పట్టించుకోవడంలేదని, వారిని నిండు గోదావరిలో ముంచేస్తున్నట్లు.ఆరోపణలు చేశారు.
ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎన్నికల సమయంలో పోలవరం నిర్వాసితులకు ఎన్నో హామీ ఇచ్చారని.
కానీ ఇప్పుడు వాటిని గాలికొదిలేశారని, వాటిని పట్టించుకోకుండా.ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో సాగునీటి కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో లెక్కలు బయటపెట్టాలని.
దేవినేని ఉమా నిలదీశారు.అంతే కాకుండా ఇప్పటి వరకు ఎంత మంది పోలవరం నిర్వాసితుల ఆదుకున్నారో కూడా చెప్పాలని.
స్పష్టం చేశారు.సాగు నీటి వల్ల ఎంత మంది రైతులు లబ్ధి పొందారో వాటికి సంబంధించి శ్వేతపత్రం.
రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు.పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయానికి సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో జగన్ ఎందుకు.
కేంద్రాన్ని ప్రశ్నించడం లేదని కమీషన్ల కోసమే ప్రాజెక్టు పనుల పై.జగన్ ప్రభుత్వం డ్రామాలాడుతున్నట్లు దేవినేని ఉమా ఆరోపించారు.
డబ్బు కావాలా.. ఐతే శవాల మధ్య 10 నిమిషాలు గడపండి.. రూ.25,000 మీవే!