మళ్లీ మొదలు : ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి ‘
TeluguStop.com
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు జోష్ లో ఉన్న ఏపీ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం,( TDP ) మళ్లీ ఏపీ అధికార పార్టీ వైసీపీ ( YCP ) ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై గళం ఎత్తేందుకు సిద్ధమవుతోంది.
ఈ మేరకు టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.
నియోజకవర్గ ఇన్చార్జిలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు అనేక సూచనలు చేశారు.ముఖ్యంగా గతంలో నిర్వహించి ప్రజల ఆదరణ పొందిన ' ఇదేం కర్మ మన రాష్ట్రానికి ' కార్యక్రమాన్ని మళ్లీ వేగవంతం చేయాలని బాబు సూచించారు.
దీనికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని, అన్ని నియోజకవర్గాలలోను ఏప్రిల్ చివరి నాటికి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సూచించారు.
ఏప్రిల్ మొదటి వారంలో మూడు జోనల్ సమావేశాలను పూర్తి చేసి తాను కూడా పలు జిల్లాల్లో జరిగే కార్యక్రమాలకు హాజరవుతానని చంద్రబాబు తెలిపారు.
"""/" /
తాజాగా క్లస్టర్ నియోజకవర్గం ఇన్చార్జిలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు అనేక సూచనలు చేశారు.
ప్రజా సమస్యలపై గట్టి పోరాటాలు చేసి మంచి ప్రజాప్రతినిధులుగా పేరు తెచ్చుకోవాలని, కొత్తగా ఎన్నికైన టిడిపి ఎమ్మెల్సీలకు చంద్రబాబు సూచించారు.
రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మరిన్ని వినూత్న కార్యక్రమాలు చేపడుతూ.వైసిపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి టిడిపి పై ఆదరణ పెంచే విధంగా ప్రయత్నాలు చేయాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచనలు చేశారు.
"""/" /
ఈ సందర్భంగా వైసీపీ అధినేత , ఏపీ సీఎం జగన్ పై చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు .
వైసిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కియా మోటార్స్ పై జగన్ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు ప్రస్తావించారు.
అప్పుడు చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు సమాధానం ఇవ్వగలవా జగన్ అంటూ బాబు ప్రశ్నించారు .
వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా జగన్ చేసిన వ్యాఖ్యలను, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం కార్యక్రమంలో వాటిని ప్రస్తావించిన వీడియో క్లిప్ లను బాబు విడుదల చేశారు .
అప్పటి జగన్ వ్యాఖ్యలు తాజాగా లోకేష్ సెల్ఫీ చాలెంజ్ లను ప్రస్తావిస్తూ వీడియోలతో చంద్రబాబు ట్విట్ చేశారు.
అక్కా చెల్లెళ్ల మధ్య గ్యాప్.. శిల్పా శిరోద్కర్ పోస్ట్ తో పూర్తి క్లారిటీ వచ్చేసిందిగా!