ఏపీ పోలీసులపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్
TeluguStop.com
ఏపీ పోలీసులపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.తమ పార్టీ నేత చెన్నుపాటి గాంధీపై దాడి చేసిన నిందితుల రిమాండ్ రిపోర్టును కోర్టు తిరస్కరించగా.
పోలీసులు వారికి స్టేషన్ బెయిల్ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.కన్ను పొడిచిన వారికి స్టేషన్ బెయిల్, నినాదాలు చేసిన వారిపై హత్యాయత్నం కేసులు ఏంటని నిలదీశారు.
ఈ క్రమంలో పోలీస్ శాఖ వ్యవహరిస్తున్న తీరు ఎంటో చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ ప్రాపకం కోసం పోలీసులు ఇంతలా సాగిలపడటాన్ని ప్రజలు ఆమోదించరని పేర్కొన్నారు.ఏపీ పోలీస్ అనే బ్రాండ్ ను సర్వనాశనం కావడానికి, ప్రజలకు అధికారులపై ఉన్న నమ్మకం పోవడానికి ఈ ఘటనే నిదర్శనంగా నిలుస్తుందన్నారు.
ఇకనైనా చట్టప్రకారం పని చేయాలంటూ చంద్రబాబు సూచించారు.
మాస్ జాతర గ్లింప్స్ తో రవితేజ ఈజ్ బ్యాక్ అనాల్సిందేనా..?ఒకప్పటి రవితేజ గుర్తుకు వచ్చాడా..?