తిడితే చులకనవుతారు... తిట్టకపోతే మితిమీరిపోతున్నారు
TeluguStop.com
ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేస్తుండడంతో.ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వేడి పెంచారు.
పార్టీ పై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టి ప్రక్షాళన చేయాలని చూస్తున్నారు.అందులోభాగంగానే.
ప్రస్తుతం నిర్వహిస్తున్న .టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం వాడివేడిగా సాగుతుంది.
నియోజకవర్గాల్లో మందకొడిగా సాగుతున్న పార్టీ సభ్యత్వ నమోదుపై ఇన్‌ఛార్జిలను చంద్రబాబు గట్టిగా నిలదీశారు.
శ్రీకాకుళం జిల్లా నుంచి హాజరుకాని నేతలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ గట్టిగా తిడితే ప్రజల్లో చులకన అవుతారని ఊరుకుంటున్నా.
తిట్టకపోతుంటే మరీ మితిమీరి ప్రవర్తిస్తున్నారు.అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
రాబోయే 6 నెలలు కఠినంగానే ఉంటానని స్పష్టం చేశారు.వ్యక్తిగత పనులుంటే ఎన్నికలు కూడా వాయిదా పడతాయని భావిస్తున్నారా అంటూ నిలదీశారు.
సభ్యత్వ నమోదు మొదటి 3 స్థానాల్లో పశ్చిమగోదావరి, కర్నూలు, కృష్ణా జిల్లాలు ఉండగా, నియోజకవర్గాల్లో అత్యధికంగా పీలేరు, అత్యల్పంగా నెల్లూరు గ్రామీణంలో సభ్యత్వం నమోదైంది.
శ్రీకాకుళం జిల్లా నుంచి వరుసగా అన్ని నియోజకవర్గాల వారీగా సభ్యత్వ నమోదు విశ్లేషణ చేశారు.