వైసీపీ మంత్రులు విశాఖ ఎయిర్ పోర్టులో జనసేన శ్రేణులను రెచ్చగొట్టారు - బుద్దా వెంకన్న
TeluguStop.com
అమరావతి: టీడీపీ నేత బుద్దా వెంకన్న కామెంట్స్.విశాఖ విమానాశ్రయంలో జనసేన నేతలు, కార్యకర్తలు చాలా హుందాగా వ్యవహరించారు.
మంత్రులు ఎయిర్ పోర్టుకి వచ్చే సమయంలో నేను అక్కడే ఉన్నాను.వైసీపీ మంత్రులు విశాఖ ఎయిర్ పోర్టులో జనసేన శ్రేణులను రెచ్చగొట్టారు.
మంత్రి రోజా వేలు చూపించారు.దానికి అర్థం ఏంటో ఆమె చెప్పాలి.
అలాగే మిగతా మంత్రులు కూడా జనసేన కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారు.దీంతో చిన్న ఘర్షణ జరిగి ఉండవచ్చు.
దాన్ని భూతద్దంలో చూపించి జనసైనికులను పోలీసులు అరెస్టు చేసి, కేసులు పెట్టారు.వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్ల నుంచి ప్రతిరోజూ ప్రతిపక్షనేతలు, ప్రజలను హింసించి, కేసులు పెట్ట, దాడులు చేయిస్తూ సీఎం జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారు.
రాష్ట్రంలో అభివృద్ధి లేదని, ఉన్న పరిశ్రమలు కూడా వెళ్లిపోయాయి.పవన్ కల్యాణ్ కు చంద్రబాబు ప్యాకేజీ ఇచ్చారని వైసీపీ మంత్రులు మొరుగుతున్నారు.
జగన్‌లా చంద్రబాబు అవినీతిపరుడుకాదు.బాబు దగ్గర అవినీతి సొమ్ము లేదు.
అలాగే పవన్ కూడా అవినీతి రాజకీయ నాయకుడు కాదు బుద్దా.వైసీపీ నేతల అవినీతిని ఇతరులపైకి నెట్టివేయడంలో చాలా ముందుంటారు.
జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని లక్షల కోట్లు సంపాదించారో ప్రజలకు తెలుసు.
అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ.విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన సిసి టీవీ ఫుటేజిని ఎడిటింగ్ చేసి చూపించారు.
కొంతమంది పోలీసులు ఖాకీ చొక్కా పక్కన పెట్టి వైసీపీ చొక్కా వేసుకున్నారు.మొన్న విజయసాయిరెడ్డి విశాఖ వస్తే ప్రజలే చొక్కా విప్పి కొట్టేవాళ్ళు.
వైసీపీకి అంతిమ ఘడియలు దగ్గర పడ్డాయి.క్విట్ ఆంధ్రప్రదేశ్ జగన్ కోసం ఇంటికి ఒకరు వచ్చి పోరాడాలి.
గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ విషయంలో డిస్సాపాయింట్ అయిన మెగా అభిమానులు…