జగన్మోహన్ రెడ్డి దోపిడీ రాజధానిగా విశాఖను మారుస్తున్నారు - అచ్చెన్నాయుడు

జగన్మోహన్ రెడ్డి దోపిడీ రాజధానిగా విశాఖను మారుస్తున్నారు – అచ్చెన్నాయుడు

జగన్మోహన్ రెడ్డి దోపిడీ రాజధానిగా విశాఖను మారుస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు విమర్శించారు.

జగన్మోహన్ రెడ్డి దోపిడీ రాజధానిగా విశాఖను మారుస్తున్నారు – అచ్చెన్నాయుడు

విజయవాడలో నిర్వహించిన నాగుల చవితి వేడుకల్లో అచ్చెన్న పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.

జగన్మోహన్ రెడ్డి దోపిడీ రాజధానిగా విశాఖను మారుస్తున్నారు – అచ్చెన్నాయుడు

ఉత్తరాంధ్ర లూటీని అడ్డుకుంటున్నామనే మంత్రులు కుక్కల్లా మొరుగుతున్నారని వ్యాఖ్యలు చేశారు.ఉత్తరాంధ్ర మంత్రుల దోపిడీ ప్రజలందరి కళ్ళకు కనిపిస్తోందని తెలిపారు.

నేతల స్వార్ధం కోసమే ప్రాంతీయ చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు.ఆంధ్రప్రదేశ్ అంటే జే గ్యాంగ్ అడ్డా కాదన్నారు.

ప్రకృతి సంపద రుషికొండను కొల్లగొట్టి కట్టుకునే ప్యాలెస్ ద్వారా జగన్మోహన్ రెడ్డి ఏం సాధిస్తారని ప్రశ్నించారు.

జగన్మోహన్ రెడ్డి బండారం బయటపడుతుందనే నిన్న టీడీపీ నాయకుల్ని అడ్డుకున్నారని మండిపడ్డారు.రాష్ట్రానికి రాజధాని ఏంటి అని ఎవరడిగినా చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితికి ఏపీని తీసుకొచ్చారన్నారు.

సుదీర్ఘ కాలం అన్ని పార్టీల్లో మంత్రులుగా చేసిన వైసీపీ నేతలు ఉత్తరాంధ్ర అభివృద్ధి చేస్తామంటే ఎవరు వద్దన్నారని అన్నారు.

రైతుల పాదయాత్రపై వైసీపీ నేతలు దండయాత్ర చేస్తున్నారన్నారు.మూడున్నరేళ్లుగా రాష్ట్రంలో దుర్మార్గుడి పాలన సాగటం వల్ల 40ఏళ్ళు వెనక్కి వెళ్లామని చెప్పారు.

పులివెందులలో కూడా గెలవలేని జగన్మోహన్ రెడ్డి ప్రజలకి 175 గెలుస్తామనే భ్రమ కల్పిస్తున్నారన్నారు.

ప్రజలు తనకు ఎందుకు ఓటేయాలో చెప్పే ఒక్క మంచి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి వద్ద లేదని తెలిపారు.

ఒక్క అవకాశంతో ప్రజలకు ఉన్న భ్రమలన్నీ తొలిగిపోయాయన్నారు.పిచ్చి వాళ్లే పొత్తులు గురించి తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని.

రాజకీయాల్లో పొత్తులు సర్వసహజమని చెప్పుకొచ్చారు.ప్రజా స్వామ్యాన్ని కాపాడుకునేందుకే కలిసొచ్చే పార్టీలను కలుపుకుని పోతామని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న మెగాస్టార్.. అభినందనలు తెలిపిన తమ్ముడు