మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కి బెయిల్ మంజూరు… కానీ

ఈ ఎస్ ఐ స్కామ్ కేసులో టీడీపీ కీలక నేత,మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

ఈ ఎస్ ఐ అవకతవకలు కేసుకు సంబంధించి మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఏసీపీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే 70 రోజులుగా రిమాండ్ లో ఉంటున్న ఆయనకు హైకోర్టు ఊరట నిచ్చింది.

ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ను హైకోర్టు మంజూరు చేస్తూ తీర్పు వెల్లడించింది.

కోవిడ్ కారణంగా ఆయన ప్రస్తుతం మంగళగిరిలోని ఎన్నారై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని గతంలో కోర్టుకు దరఖాస్తు చేయగా న్యాయస్థానం తిరస్కరించింది.

అయితే తాజాగా మరోసారి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా, దీనిపై సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థి లోద్ర, హైకోర్టు సీనియర్ న్యాయవాది వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు.

అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టి లో పెట్టుకున్న న్యాయస్థానం వాదనలు విన్న తరువాత మూడు రోజుల పాటు తీర్పును రిజర్వ్ లో పెట్టింది.

తాజాగా ఈ కేసుకు సంబంధించి ఈ రోజు తీర్పు వెల్లడించింది.కొద్ది సేపటి క్రితమే హైకోర్టు అచ్చెన్నాయుడుకి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

రూ.2 లక్షలు షూరిటీ ఇవ్వాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం దాటి వెళ్లవద్దని, సాక్షులను తారుమారు చేయవద్దని, దర్యాప్తు అధికారికి అందుబాటులో ఉండాలని ఆదేశాల్లో పేర్కొంది.

మరోవైపు, అచ్చెన్నకు బెయిల్ మంజూరు కావడంతో ఆయన కుటుంబసభ్యులు, టీడీపీ శ్రేణులు సంతోషంలో మునిగిపోయాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్11, శుక్రవారం 2025