శ్రీకాకుళంలో వైసీపీ- టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ! ఇనుప రాడ్లతో దాడులు!

ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయ పార్టీలో నాయకులు ఒకరి మీద ఒకరు మాటల దాడులు చేసుకుంటూ వుంటే, క్రింది స్థాయి కార్యకర్తలు మాత్రం మాటల దాడిని దాటిపోయి, ఒకరి మీద ఒకరు భౌతిక దాడులు చేసుకునేంత వరకు వెళ్తుంది.

అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ కార్యకర్తలు, క్రింది స్థాయి నాయకులు రెచ్చిపోతూ వుంటే, అదే స్థాయిలో వైసీపీ క్రింది స్థాయి నేతలు కూడా ఎదురుదాడులు చేస్తున్నారు.

దీంతో ఇరు వర్గాలు ఒకరి మీద ఒకరు కత్తులు, కర్రలు, ఇనుప రాడ్లతో దాడులు చేసుకునేంత వరకు రాజకీయ వాతావరణం వెళ్ళిపోయింది.

ముఖ్యంగా ఉత్తరాంద్ర జిల్లాలో ఇలాంటి రాజకీయ వర్గ పోరు ఎక్కువగా వుంటుంది.ఇప్పుడు అలాంటి పరిస్థితి శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి పరిధిలో కోట బొమ్మాలిలో చోటు చేసుకుంది.

టీడీపీ, వైసేపీ పార్టీ కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి ఇనుప రాడ్లతో దాడులు చేసుకున్నారు.

ఈ సంఘటనలో పలువురు వైసీపీ కార్యకర్తలకి గాయాలినట్లు తెలుస్తుంది.జిల్లాలో ఏపీ మంత్రి అచ్చం నాయుడు ప్రోద్బలంతోనే వైసీపీకి చెంధిక నేతలపై తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు, నేతలు దాడులకి పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు.

అయితే వైసీపీ పార్టీ నేతలు మూకలుగా చేసి అదే పనిగా రెచ్చగొడుతూ వున్నారని, వారే కావాలని తెలుగు దేశం కార్యకర్తలపై దాడులకి పాల్పడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఏది ఏమైనా ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ, టీడీపీ రాజకీయ వర్గ పోరు కారణంగా కోట బొమ్మాలి రక్తసిక్తంగా మారింది.

ఇక ఈ రెండు వర్గాల గొడవలతో స్థానిక ప్రజలు కూడా తీవ్ర భయాందోళనకి గురవుతున్నారు.

ఇప్పటికే ఆ ప్రాంతంలో పోలీసులు రంగంలోకి దిగి రెండు వర్గాల వారిని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?