ఎయిరిండియాపై భారత సంతతి వ్యక్తి కన్ను: టాటాలతో పోటీ..!!
TeluguStop.com
దాదాపు రూ.85,000 కోట్ల రుణ భారంతో, పీకల్లోతు నష్టాలతో సాగుతున్న ఎయిరిండియాను ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
భారత ప్రభుత్వం తన ఆధీనంలో వున్న 51 శాతం వాటాను విక్రయిస్తున్నట్లు ప్రకటించింది.
ఇందుకు సంబంధించి బిడ్లు సైతం ఆహ్వానించింది.ఈ నేపథ్యంలో టాటా సన్స్, స్పైస్‌జెట్‌తో పాటు పలు సంస్థలు ‘ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ (ఈవోఐ)’ దాఖలు చేశాయి.
ఎయిర్‌ఇండియా ఉద్యోగుల గ్రూప్, భారత సంతతి వ్యక్తికి చెందిన న్యూయార్క్ సంస్థ కూడా బిడ్లు దాఖలు చేశాయి.
అయితే ‘ఈవోఐ’ దాఖలు చేసిన విషయాన్ని స్పైస్ జెట్ ధ్రువీకరించకపోవడం గమనార్హం.నిర్దేశిత ప్రమాణాల మేరకు బిడ్‌కు అర్హత సాధించిన సంస్థలకు 2021 జనవరి 5వ తేదీన కేంద్రం సమాచారం ఇస్తుంది.
అర్హత సాధించిన సంస్థలు ఎంటర్‌ప్రైజ్‌వాల్యూ (ఈవీ) ఆధారంగా పోటీ పడాల్సి ఉంటుంది.ఎయిర్‌ఇండియాను టేకోవర్ చేసుకునేందుకు టాటా సన్స్ ప్రధాన పోటీ దారుగా ఉంది.
దశాబ్దాల క్రితం తాము తప్పనిసరి పరిస్ధితుల్లో వదులుకోవాల్సిన వచ్చిన ఎయిరిండియాను ఎలాగైనా దక్కించుకోవాలని టాటాలు పావులు కదుపుతున్నారు.
టాటా గ్రూప్ 1932 అక్టోబర్‌లో టాటా ఎయిర్‌లైన్స్‌ను ఏర్పాటు చేసింది.పారిశ్రామిక దిగ్గజం జేఆర్‌డీ టాటా దీన్ని ప్రారంభించారు.
ఆ తర్వాత 1946లో దీని పేరు ఎయిరిండియాగా మారింది.1953లో భారత ప్రభుత్వం ఈ సంస్థను జాతీయం చేయడంతో టాటా గ్రూప్ చేజారింది.
"""/"/
మరోవైపు, ఎయిరిండియాకు చెందిన సుమారు 219 మంది ఉద్యోగుల బృందం.అమెరికాకు చెందిన ఇంటరప్స్ అనే ఫండ్‌తో కలిసి కన్సార్షియంగా ఏర్పడి ఈవోఐ దాఖలు చేసింది.
ఉద్యోగులు తలో రూ.1 లక్ష వేసుకుని కన్సార్షియంలో 51 శాతం వాటా తీసుకోగా, మిగతా 49 శాతం వాటా ఇంటరప్స్‌కి ఉంది.
దీనికి సంబంధించి నవంబర్‌లో సమావేశమైన నలుగురైదుగురు ఎఐ సీనియర్ ఉద్యోగులు చేసిన ప్రతిపాదనలకు మిగితా సిబ్బంది మొత్తం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.
సంస్థలో పనిచేస్తున్న మొత్తం 14 వేల మంది ఉద్యోగులు తలా ఒక లక్ష రూపాయల చొప్పున వేసుకుంటే సులభంగా ఎయిరిండియాను కొనుగోలు చేయవచ్చన్న నిర్ణయానికి వచ్చారు.
ఉద్యోగులు అనుకున్నట్లుగా జరిగితే దేశంలోని కార్పొరేట్ సంస్థల చరిత్రలో ఇదో అద్బుతం కానుంది.
మరోవైపు టాటాలతో పాటు ఎయిరిండియా ఉద్యోగులతో పోటీ పడుతున్న భారత సంతతి వ్యక్తి సారథ్యంలోనే కంపెనీ ఏమిటనేది తెలియాల్సి వుంది.
ఇక ఎయిరిండియాలో 100 శాతం వాటాలు పొందేందుకు ప్రవాస భారతీయులకు కేంద్రం అనుమతించిన సంగతి తెలిసిందే ఇది ఎస్ఓఈసీ నిబంధనల ఉల్లంఘన కిందకు రాదని, ఎన్ఆర్ఐ పెట్టుబడులను దేశీయ పెట్టుబడులుగానే భావిస్తామని కేంద్రం తెలిపింది.
నెయ్యితో ఆరోగ్యాన్నే కాదు అందాన్ని కూడా పెంచుకోండిలా!