ఈవీ మార్కెట్‌ని దున్నేస్తున్న టాటా టియాగో.. 4 నెలల్లో 10 వేల కార్లు సేల్!
TeluguStop.com
ప్రముఖ భారతీయ కార్ల తయారీ సంస్థ టాటా నుంచి ( Tata Motors )లాంచ్ అయిన ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ టాటా టియాగో ఈవీ ఎలక్ట్రిక్ ( Tiago EV )మార్కెట్‌ను దున్నేస్తోంది.
లాంచ్ అయిన నాలుగు నెలల్లోపే ఈ కార్లను 10,000 యూనిట్లకు పైగా విక్రయించినట్లు తాజాగా కంపెనీ ప్రకటించింది.
ఈ స్థాయిలో కార్లు అమ్ముడు పోవడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే.టియాగో ఈవీకి 2022, డిసెంబర్ నాటికి 20,000 బుకింగ్స్ వచ్చాయి.
దీంతో ఇది భారతదేశంలో అత్యంత వేగంగా బుక్ అయిన ఎలక్ట్రిక్ వాహనంగా నిలిచింది.
"""/" /
టాటా ప్రకారం, టియాగో ఈవీ 491 నగరాల్లో మొత్తం 11.
2 మిలియన్ కి.మీ ప్రయాణించి పర్యావరణంలోకి 1.
6 మిలియన్ గ్రాముల CO2 ఉద్గారాలను వెళ్లకుండా చేసింది.టియాగో ఈవీలో ప్రీమియం ఫీచర్లు, భద్రత, సాంకేతికత, పర్యావరణహితమైన ఫీచర్లు ఉన్నాయి.
ఇది యూజర్లకు అత్యుత్తమ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.టియాగో ఈవీ రిలీజ్ అయిన సమయం నుంచి సరికొత్త మైలురాళ్లను సృష్టిస్తోందని మార్కెటింగ్, సేల్స్ సర్వీస్ స్ట్రాటజీ హెడ్ వివేక్ శ్రీవత్స తెలిపారు.
"""/" /
టాటా టియాగో ఈవీ మూడు బ్యాటరీ-మోటార్ కాన్ఫిగరేషన్‌లతో( Battery Configurations ) వస్తుంది.
మొదటి ఆప్షన్‌లో 3.3kW AC ఛార్జింగ్‌తో 19.
2kWh బ్యాటరీ ప్యాక్ ఉంది, ఇది గరిష్టంగా 60 Bhp శక్తిని, 105Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది.
"""/" / రెండవ కాన్ఫిగరేషన్‌లో 3.3kW AC ఛార్జింగ్‌తో 24kWh బ్యాటరీ ప్యాక్ ఉంది, ఇది గరిష్టంగా 69 Bhp శక్తిని, 114Nm టార్క్‌ను అందిస్తుంది.
మూడవ కాన్ఫిగరేషన్ 24kWh బ్యాటరీ ప్యాక్, 7.2kW AC ఛార్జింగ్, గరిష్టంగా 74 Bhp మరియు 114Nm టార్క్‌తో వస్తుంది.
టియాగో ఈవీ ప్రారంభ ధర రూ.8.
69 లక్షలు, టాప్ మోడల్స్ ధర రూ.12.
04 లక్షలు (ఎక్స్-షోరూమ్).
మోకాళ్ళ నొప్పులకు ఈ ఆయిల్ ఒక ఔషధం.. ఇంట్లోనే తయారు చేసుకోండిలా!