టాటా మోటార్స్ సంచలన రికార్డు.. ఒక్కరోజులోనే అన్ని వాహనాలు డెలివరీ..!

ప్రముఖ వాహనాల తయారీదారు టాటా మోటార్స్ తాజాగా ఒక సంచలన రికార్డు నెలకొల్పింది.

అదేంటంటే ఈ కంపెనీ ఒక్క రోజులోనే ఇండియాలో ఏకంగా 712 ఎలక్ట్రిక్ వెహికల్స్ డెలివరీ చేసింది.

మన దేశంలో ఒకే రోజులో ఈ రేంజ్ లో ఫోర్ వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ డెలివరీ చేయడం ఇదే మొదటిసారి.

శనివారం నాడు టాటా మోటార్స్ మహారాష్ట్ర, గోవాలోని కస్టమర్లకు 564 నెక్సాన్ ఈవీలు, 148 టిగోర్ ఈవీలు డెలివరీ చేసింది.

టిగోర్ ఎలక్ట్రిక్ వెహికల్ 306 కి.మీల రేంజ్‌ ఆఫర్ చేస్తుందని ఆటోమోటావ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కోటా సర్టిఫికెట్ కూడా ఇచ్చింది.

ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్స్ లో ఈ రేంజ్ చాలా ఎక్కువ అని చెప్పవచ్చు.

టెక్నికల్ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.టిగోర్ ఈవీలో 26 కేడబ్ల్యూహెచ్ హై ఎనర్జీ డెన్సిటీ కలిగిన లిథియం అయాన్ బ్యాటరీ ఆఫర్ చేయడం విశేషం.

ఇది కేవలం 5.7 సెకన్లలోనే గంటకు సున్నా నుంచి 60 కి.

మీలను వేగాన్ని సునాయాసంగా అందుకోగలదు.ఇకపోతే నెక్సాన్ ఈవీ కూడా 312 కి.

మీ రేంజ్‌ అందిస్తుంది.ఈ విషయాన్ని ఏఆర్ఏఐ సర్టిఫైడ్‌ చేసింది.

129 పీఎస్ పర్మినెంట్ మాగ్నెట్ ఏసీ మోటార్‌తో ఇది పనిచేస్తుంది.ఇందులో 30.

2 కేడబ్ల్యూహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ అమర్చారు. """/"/ ‘‘మహారాష్ట్ర, గోవాలోని మా కస్టమర్లకు సింగిల్ డేలో 712 ఈవీలను డెలివరీ చేశాం.

ఇండియాలో బిగ్గెస్ట్ సింగిల్ డెలివరీ చేసిన తొలి 4 వీలర్ మ్యానుఫ్యాక్చర్ మేమే అయ్యాం.

ఇందుకు మేము చాలా సంతోషిస్తున్నాం.ఈ డెలివరీతో టాటా మోటార్స్ ఈవీలు పర్సనల్ మొబిలిటీ స్పేస్‌లో రోడ్లపై సక్సెస్‌ఫుల్‌గా తిరుగుతాయి.

ఈ రేంజ్ లో మా వెహికల్స్ డెలివరీ అయ్యాయంటే.దానికి కారణం కస్టమర్లు మాలో చూస్తున్న విలువలకు, విశ్వాసం అని చెప్పచ్చు’’ అని టాటా ప్యాసెంజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సేల్స్ అండ్ సర్వీసెస్ స్ట్రాటజీ మార్కెటింగ్ హెడ్ వివేక్ శ్రీవాత్స పేర్కొన్నారు.

టెన్నిస్ మ్యాచ్‌కు హాజరైన కుక్క.. తర్వాతేం చేసిందో చూడండి..