దేశంలోని ఫస్ట్ టాటా వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ ఇక్కడే!
TeluguStop.com
భారతదేశ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ కాలుష్యాన్ని తగ్గించడం కోసం కంకణం కట్టుకుంది.
అందులో భాగంగానే RDE నిబంధనలకు అనుగుణంగా వాహనాలను మార్కెట్లోకి తీసుకొస్తోందనే విషయం మీకు తెలిసే ఉంటుంది.
తాజాగా లైఫ్‌టైమ్ ముగిసిన వాహనాలను రెస్ పెక్ట్‌తో రీసైకిల్ చేయడానికి భారత్‌లో ప్రత్యేకంగా మొట్టమొదటి రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ సదుపాయాన్ని ఆరంభించింది.
Re అని నామకరణం చేసింది.Re.
Wi.Re అంటే 'రీ సైకిల్ విత్ రెస్పెక్ట్' అని అర్థం.
ఈ యూనిట్ రాజస్తాన్‌లోని జైపూర్‌లో ప్రారంభించింది.టాటా మోటార్స్ వెహికల్ స్క్రాపింగ్ యూనిట్‌ను తాజాగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు.
"""/" /
ఇకపోతే ఇది సంవత్సరానికిగాను 15,000 వాహనాలను స్క్రాప్ చేయగలుగుతుంది.ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మీడియాతో మాట్లాడుతూ.
"నేషనల్ వెహికల్ స్క్రాపేజ్ పాలసీని సర్యులర్ ఆర్థిక వ్యవస్థను క్రియేట్ చేయడానికి ప్రవేశ పెట్టడం జరిగింది.
ఇది పనికిరాని, కాలుష్యం వెదజల్లే వాహనాలను దశలవారీగా తొలగించడానికి అవసరమైన ఎకో సిస్టమ్‌ను సృష్టిస్తుంది.
తద్వారా ఇంధన సామర్థ్య వాహనాలతో రీప్లేస్ చేయడం వల్ల దేశంలో కాలుష్యాన్ని విపరీతంగా తగ్గించవచ్చు.
" అని ఆశాభావం వ్యక్తం చేసారు. """/" /
ఇకపోతే Re.
Wi.Re ద్వారా అధునూతన ఎకో ఫ్రెండ్లీ ప్రాసెస్ ఉపయోగించి ఎండ్- ఆఫ్ లైఫ్ వాహనాలను సేఫ్‌గా, సస్టైనబుల్‌గా డిస్‌మాటిల్ చేస్తారు.
దీన్ని గంగానగర్ వాహన్ ఉద్యోగ్ ప్రైవేట్ లిమిటెడ్ డెవలప్ చేయగా టాటా మోటార్స్ భాగస్వామ్యంతో దీన్ని నిర్వహించనుంది.
ఒక్క టాటా కంపెనీవి మాత్రమే కాకుండా అన్ని బ్రాండ్స్ ప్యాసింజర్, కమర్షియల్ వాహనాలను ఇది స్క్రాప్ చేస్తుంది.
టైర్లు, బ్యాటరీలు, ఫ్యూయల్, ఆయిల్స్, లిక్విడ్స్, గ్యాసెస్ వంటి కాంపోనెంట్స్ సేఫ్‌గా డిస్‌మ్యాటిల్ చేయడానికి ఇక్కడ ప్రత్యేక స్టేషన్‌లు కలవు.
ఇక పరుగులు పెట్టిద్దాం .. ఏపీపై బిజెపి ఫోకస్