బిగ్ బాస్ లో ఎలిమినేట్ అయిన టేస్టీ తేజ ఎన్ని లక్షలు సంపాదించారో తెలుసా?
TeluguStop.com
తెలుగులో ఇటీవలే మొదలైన బిగ్ బాస్ 8 తెలుగు( Bigg Boss 8 Telugu ) చూస్తుండగానే అప్పుడే ముగింపు దశకు చేరుకుంది.
మరికొద్ది రోజుల్లోనే ఫైనల్ ఎపిసోడ్ జరగనుంది.అయితే ఫినాలే ఎపిసోడ్ దగ్గర పడుతుండడంతో హౌస్ లో నువ్వా నేనా అన్న రేంజ్ లో పోటీ జరుగుతోంది.
ఇకపోతే తాజాగా బిగ్ బాస్ హౌస్ నుంచి టేస్టీ తేజ ( Tasty Teja
)ఎలిమినేట్ అయి బయటకి వెళ్లిపోయిన విషయం తెలిసిందే.
తన కోరికని ఈ సీజన్‌లో నెరవేర్చుకున్న తేజ రెమ్యునరేషన్ కూడా బాగానే సంపాదించాడట.
ఇంతకీ ఎన్ని లక్షలు అందుకున్నాడంటే? అక్టోబరు 6న వైల్డ్ కార్డ్ ఎంట్రీల్లో ఒకడిగా టేస్టీ తేజ వచ్చాడు.
"""/" /
ప్రారంభంలో ఉన్నంతలో బాగానే ఎంటర్‌టైన్ చేశాడు.తర్వాత తర్వాత అరుపులు గొడవలు ఎక్కువైపోయాయి.
తర్వాత ప్రేక్షకులను బాగా నస పెట్టేశాడు.దీంతో ఎలిమినేట్ కావడం అయితే పక్కా అని అందరూ అనుకున్నారు.
కాకపోతే అలా సేవ్ అయిపోతూ వచ్చాడు తేజ.ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్ ( Double Elimination )లో ఒకడిగా బయటకొచ్చేశాడు.
ఫ్యామిలీ వీక్ వరకు ఉంటే తన తల్లి వస్తుందని ఆశపడ్డాడు.అనుకున్నట్లే అది నెరవేర్చుకున్నాడు.
"""/" /
అయితే హౌసులో 8 వారాలు పాటు ఉన్న తేజ ఒక్కో వారానికి గానూ లక్షన్నర అందుకున్నాడట.
అంటే 8 వారాలకు గానూ రూ.12 లక్షలు తేజకి రాబోతున్నాయట.
అయితే ఒక రకంగా చూసుకుంటే తేజకి ఇది మంచి మొత్తమే అని చెప్పవచ్చు.
ఇకపోతే నెక్స్ట్ ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ పృథ్వి అని తెలుస్తోంది.అంతేకాకుండా వచ్చేవారం కూడా డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
వాటి నుంచి ఎవరూ తప్పించుకోలేరు.. డైరెక్టర్ శంకర్ షాకింగ్ కామెంట్స్ వైరల్!