సందీప్ మాస్టర్ జ్యోతి రాజ్ మధ్య గొడవలు పెట్టిన టేస్టీ తేజ..హౌస్ లో అలా ఉన్నాడంటూ?
TeluguStop.com
బిగ్ బాస్ సీజన్ 7 ( Bigg Boss 7 )కార్యక్రమంలో భాగంగా పాల్గొన్నటువంటి కంటెస్టెంట్లలో సందీప్ మాస్టర్ ( Sandeep ) అలాగే టేస్టీ తేజ ( Teja ) కూడా ఒకరు అనే సంగతి మనకు తెలిసిందే.
వీరిద్దరూ కూడా ఎలిమినేట్ అయిన సంగతి మనకు తెలిసిందే.సందీప్ మాస్టర్ ఎనిమిదవ వారం ఎలిమినేట్ కాగా టేస్టీ తేజ 9వ వారం ఎలిమినేట్ అయ్యారు.
ఇక తేజకు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున సెలబ్రెటీలతో ఇంటర్వ్యూలు చేయడం వంటి కార్యక్రమాలతో బిజీ అయ్యారు.
ఇదిలా ఉండగా తాజాగా టేస్టీ తేజ సందీప్ మాస్టర్ అలాగే జ్యోతిరాజ్ ( Jyothi Raj ) ఇద్దరితో కలిసి సందడి చేశారు.
ఇలా ఈ ముగ్గురు ఒక రెస్టారెంట్లో సందడి చేశారు.ఇకపోతే టేస్ట్ తేజా హౌస్ లో ఉన్నన్ని రోజులు ఆయన ఎవరిని నామినేట్ చేస్తే వారందరూ కూడా ఎలిమినేట్ అయిన సంగతి మనకు తెలిసిందే.
ఇక తొమ్మిదవ వారం తానే బయటకు రావడంతో ఎంతోమంది ఈయన ఎలిమినేషన్ పట్ల వివిధ రకాల మీమ్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
ఇక తాజాగా మరోసారి ఈయన సందీప్ మాస్టర్ ఆయన భార్య ఇద్దరికీ మధ్య గొడవపెట్టారని స్పష్టంగా అర్థమవుతుంది.
ఈ వీడియోలో భాగంగా సందీప్ మాస్టర్ భార్య జ్యోతితో తేజ మాట్లాడుతూ మాస్టర్ గారు హౌస్ లో ఉన్నన్ని రోజులు చాలా బాగా ఆడారు అలాగే అమ్మాయిలతో కూడా చాలా చనువుగా ఉండేవారని తెలిపారు.
"""/" /
ఈ విధంగా తేజ చెప్పడంతో సందీప్ ఒక్కసారిగా షాక్ అయ్యారు దీంతో అవును నేను కూడా రెండు మూడు వీడియోలు సేవ్ చేసి పెట్టుకున్నానని తెలిపారు.
ఇక వంటింట్లో ఎక్కువగా ప్రియాంకకు హెల్ప్ చేస్తూ ఉండేవారు అంటూ తేజ చెప్పగా వెంటనే జ్యోతి అవును ఇక్కడ మనమంతా ఒక్కటే కదా ఇది మన ఇల్లు ఒకరికొకరు హెల్ప్ చేసుకోకపోతే ఎలా అంటూ మాట్లాడారు కానీ ఇంట్లో మాత్రం ఆయన నాకు ఒక హెల్ప్ కూడా చేయరు అంటూ జ్యోతి తెలియజేశారు.
అదేవిధంగా ఇంట్లో అమ్మాయిల అందరికీ కూడా మాస్టర్ గారు తినిపించేవారు అంటూ తేజ చెప్పడంతో సందీప్ ఒక్కసారిగా బిక్క ముఖం వేసుకున్నారు.
"""/" /
ఇలా సందీప్ హౌస్లో చేసిన బాగోతాల గురించి తేజ బయట పెట్టడంతో సందీప్ మాస్టర్ భార్య ఒక్కసారిగా ఫైర్ అయ్యారు.
అయితే ఈ వీడియో పై ఎంతోమంది స్పందిస్తూ వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
తేజ లాంటి ఒక ఫ్రెండ్ ఉంటే చాలు కాపురాలు సర్వనాశనం అంటూ నేటిజన్స్ ఈ వీడియో పై కామెంట్స్ చేస్తున్నారు.
ఇక బిగ్ బాస్ హౌస్ లో రోటీలు చేస్తూ తినిపిస్తుంటే డబ్బులు ఇస్తారు ఇంట్లో ఇవ్వరు కదా అక్క అంటూ మరికొందరు ఈ వీడియో పై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
టేస్టీ తేజ సందీప్ మాస్టర్ ని హౌస్ లోనే కాకుండా బయట కూడా వదిలిపెట్టడం లేదే పాపం ఇద్దరికీ బాగా ఫిట్టింగ్ పెట్టాడు అంటూ ఈ వీడియో పై కామెంట్స్ చేస్తున్నారు.
టిక్‌టాక్ ఉన్న ఐఫోన్ కోసం రూ.43 కోట్లా.. అమెరికన్ జనాల్లో టిక్‌టాక్ పిచ్చి పీక్స్‌కి!