పుష్ప కోసం ఆ విలన్ కి తరుణ్ గొంతు ఇవ్వబోతున్నాడు

అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్ర పుష్ప.

ఈ మూవీని రెండు భాగాలుగా తీసుకొచ్చే ప్లాన్ లో సుకుమార్ ఉన్నాడు.భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మలయాళీ స్టార్ ఫాహద్ ఫాజిల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు.

ఇప్పటికే అతను కూడా షూటింగ్ లో పాల్గొన్నాడు.అయితే కరోనా లాక్ డౌన్, సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది.

మళ్ళీ కరోనా సడలింపులు రాగానే చిత్రీకరణ మొదలవుతుంది.ఇదిలా ఉంటే ఈ మూవీ నుంచి అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా వచ్చిన పుష్పరాజ్ టీజర్ అందరిని ఆకట్టుకుంది.

దీంతో సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.అల్లు అర్జున్ ఈ మూవీ నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరో పాత్రలో కనిపించబోతున్నాడు.

ఇక రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది.హాట్ యాంకర్ అనసూయ కీలక పాత్రలో మూవీలో కనిపించబోతుంది.

"""/"/ సునీల్ కి భార్యగా అనసూయ పాత్ర ఉంటుందని టాక్ వినిపిస్తుంది.ఇదిలా ఈ సినిమా కోసం హీరో తరుణ్ తో సుకుమార్ సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తుంది.

అయితే ఇది సినిమాలో పాత్ర కోసం మాత్రం కాదు.రీసెంట్ గా అధిరన్ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ లో ఫాహద్ ఫాజిల్ పాత్రకి తరుణ్ డబ్బింగ్ చెప్పాడు.

ఈ డబ్బింగ్ భాగా వర్క్ అవుట్ అవడంతో సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది.

డబ్బింగ్ అద్బుతంగా ఉందనే ప్రశంసలు కూడా వచ్చాయి.ఈ నేపధ్యంలో పుష్ప మూవీలో ఫాహద్ పాత్రకి తరుణ్ తోనే డబ్బింగ్ చెప్పించాలని సుకుమార్ డిసైడ్ అయ్యి అతన్ని సంప్రదించినట్లు తెలుస్తుంది.

ఇక తరుణ్ కూడా డబ్బింగ్ చెప్పడానికి ఆసక్తిగానే ఉన్నట్లు టాక్ నడుస్తుంది.

బాలయ్య గొప్పదనం గురించి షాకింగ్ విషయాలు వెల్లడించిన ప్రముఖ నటి.. ఏమైందంటే?