సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు తరుణ్ చుగ్ కౌంటర్
TeluguStop.com
తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు బీజేపీ నేత తరుణ్ చుగ్ కౌంటర్ ఇచ్చారు.
మునుగోడులో గెలిచేందుకు ఎన్నో కుట్రలు చేశారని ఆరోపించారు.అంతేకాకుండా టీఆర్ఎస్ ధనబలం చూపించిందన్నారు.
మునుగోడు కేసీఆర్ అహంకారం ఓడిపోతుందన్న ఆయన కేసీఆర్ ను ప్రజలు ఇంటికి పంపడం ఖాయమని పేర్కొన్నారు.
ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో కథ, స్క్రీన్ ప్లే మొత్తం కేసీఆర్ దేనని విమర్శించారు.
బీజేపీపై టీఆర్ఎస్ చేసే ఆరోపణల్లో నిజం లేదని చెప్పారు.ఎమ్మెల్యేల కొనుగోలులో తమ ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టం చేశారు.
దీనిపై బండి సంజయ్ గుడికి వెళ్లి ప్రమాణం కూడా చేశారని తెలిపారు.మీరు చెప్పేది నిజమైతే ఎందుకు ప్రమాణం చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.
ప్రజలు సరైన సమయంలో టీఆర్ఎస్ కు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారని వెల్లడించారు.