టార్గెట్ సీతక్క.. కే‌సి‌ఆర్ మాస్టర్ ప్లాన్ ?

కాంగ్రెస్ పార్టీలో ( Congress Party )ఉన్న బలమైన నేతలలో ములుగు ఎమ్మెల్యే అనసూయ అలియాస్ సీతక్క( Sitakka ) కూడా ఒకరు.

కోయ సామాజిక వర్గానికి చెందిన సీతక్కకు ఆదివాసీలలో బలమైన మద్దతు ఉంది.అంతే కాకుండా గతంలో మావోయిస్ట్ నాయకురాలిగా కూడా పని చేయడంతో మావోయిస్ట్ సానుభూతి పరులలోనూ సీతక్కకు మద్దతు ఉంది.

ఇంకా వ్యక్తిగత సేవ కార్యక్రమాలు చేయడంలోనూ, నియోజిక వర్గ సమస్యలను తీర్చడంలోనూ సీతక్క ఎప్పటికప్పుడు తన వ్యక్తిత్వాన్ని చతుకుంటూ వస్తున్నారు.

దాంతో ములుగు నియోజిక వర్గంలో అత్యంత ప్రజాదరణ ఉన్న మహిళా ఎమ్మెల్యేగా సీతక్క ఉన్నారు.

"""/" / దాంతో ఆమెను ఆ నియోజిక వర్గంలో ఓడించడం అంతా తేలికైన విషయం కాదు.

అందుకే ఈసారి సీతక్క టార్గెట్ గా బి‌ఆర్‌ఎస్ అధినేత కే‌సి‌ఆర్( KCR ) మాస్టర్ ప్లాన్ వేశారట.

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ములుగు నియోజిక వర్గంలో బి‌ఆర్‌ఎస్ జెండా ఎగిరేలా వ్యూహాలు రచిస్తున్నారట.

అందుకే సీతక్కకు ధీటుగా ఆమె సామాజిక వర్గానికి చెందిన నాగజ్యోతికి( Nagajyoti ) టికెట్ కన్ఫర్మ్ చేశారు గులాబీ బాస్.

అయితే ఆమెకు పెద్దగా రాజకీయ అనుభవం లేని కారణంగా సీటు క్యాన్సిల్ చేసే అవకాశం ఉందని ఇటీవల వార్తలు వినిపించాయి.

కానీ సీతక్క కు చెక్ పెట్టలంటే నాగజ్యోతి మాత్రమే కరెక్ట్ అని ఆ విషయంలో ఎంకెలాంటి మార్లులు చేసే అవకాశం కే‌సి‌ఆర్ ఫైనల్ డెసిషన్ కు వచ్చినట్లు తెలుస్తోంది.

"""/" / ఇక సీతక్క నిత్యం ఎలాగైతే ప్రజల్లో ఉంటుందో అదే విధంగా నాగజ్యోతి కూడా ప్రజల్లో యాక్టివ్ గా అధినేత ఇప్పటికే సూచించారట.

కాగా నాగజ్యోతికి రాజకీయ అనుభవం లేనప్పటికి నియోజిక వర్గ ప్రజల్లో మంచిగానే పేరుంది.

దానికి తోడు నాగజ్యోతి తల్లిదండ్రులు కూడా గతంలో మావోయిస్టులుగా అజ్ఞాతంలో పనిచేసిన వారే.

అన్నీ విధాలుగా సీతక్కను ఢీ కొట్టేందుకు నాగజ్యోతి కరెక్ట్ అని కే‌సి‌ఆర్ భావిస్తున్నారట.

పైగా ములుగు నియోజిక వర్గంలో వరదల కారణంగా దెబ్బ తిన్న కుటుంబాలకు అండగా నిలిచి అక్కడి ప్రజలకు దగ్గరయ్యారు కే‌సి‌ఆర్.

దీంతో ఈసారి ములుగులో బి‌ఆర్‌ఎస్ ( Brs )విజయం గ్యారెంటీ అని ఆయన ధీమాగా ఉన్నారు.

మరి ములుగులో బి‌ఆర్‌ఎస్ సత్తా చాటుతుందో లేదో చూడాలి.

హిందీలో 3 సినిమాల డీల్ కు ఓకే చెప్పిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. అసలేమైందంటే?