టార్గెట్ ఓవైసీనా.. ? ఓటింగా...? అసలు ఫైరింగ్ రహస్యమేంటో ?
TeluguStop.com
ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారం చేస్తున్న హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఓవైసీ కాన్వాయ్‌పై జరిగిన కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
ఇది ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతోందన్న చర్చ ఇప్పుడు జరుగుతోంది.ఈ ఘటన ముస్లింలను ఐక్యం చేసి ఎంఐఎం పక్షాన నిలబడేలా చేసిందనుకోవచ్చు.
బీజేపీకి కావాల్సింది కూడా ఇదే.ముస్లింల ఓట్లు సమాజ్‌వాదీ పార్టీకి గానీ, కాంగ్రెస్‌కు గాని పోల్ కావొద్దు.
అలా అయితేనే యూపీలో బీజేపీ గెలుపుబాహుటా ఎగరేసేందుకు అవకాశాలు ఉంటాయి.అయితే కాల్పులు నామమాత్రంగానే చేయడం.
కారు టైరు మాత్రమే దెబ్బతినడం, అసదుద్దిన్ ప్రాణాలతో భయటపడడం లాంటివి అనేక అనుమానాలకు తావిస్తోంది.
కదులుతున్న కారుపై కాల్పుల ఘటనలో సీరియస్‌నెస్ లేదని పోలీసులే చెబుతున్నారు.అయితే అసదుద్దిన్‌పై హత్యకు కుట్ర పన్నితే కాల్పుల ఘటన మరోలా ఉండేది.
అత్యంత భయానక వాతావరణం సృష్టించేవారు.మొత్తానికైతే కాల్పులు మాత్రం జరిగాయి.
ఈ కాల్పులు దేనికోసం జరిగాయని, అసలు ఫైరింగ్ వెనుక ఆంతర్యమేంటనేది చర్చగా సాగుతోంది.
రాజకీయాల్లో స్వప్రయోజనాల కోసం కూడా ఇలాంటి కుయుక్తులకు కూడా పోతుంటారు.ఇదే విషయాన్ని రాజకీయ విశ్లేషకులు కూడా పేర్కొంటున్నారు.
ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పీ)ని దెబ్బతీసేందుకు ఈ ఘటనకు పాల్పడినట్టు కనిపిస్తోంది. """/"/
ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో సుమారు వంద స్థానాల్లో ఎంఐఎం పోటీలో ఉంటుంది.
సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో దిగింది.ఇక్కడ ముస్లింల ఓటు బ్యాంక్ ఎస్‌పీకి కలిసొచ్చేది.
నాడు కాంగ్రెస్‌తో జతకట్టిన సమయంలో ముస్లింల ఓటు బ్యంక్ ఎస్‌పీ ఖాతాలోకి వెళ్లిపోయింది.
ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ, ఎస్‌పీ మధ్యనే బాహాబాహి పోటీ ఉంటుందని సర్వేలు కూడా చెబుతున్నాయి.
ఈ క్రమంలో ఓవైసీ పార్టీ పుంజుకుంటేనే బీజేపీకి కలిసొస్తుందన్నది వాస్తవం.మొత్తానికి ఎస్‌పీని కట్టడి చేస్తే ఆ పార్టీ నుంచి పోటీ ఉండదని భావిస్తున్నారు.
కాల్పుల ఘటన కూడా బీజేపీకి ప్లస్‌పాయింట్‌గా మారుతోంది.బీహార్‌లో బీజేపీ కూటమి అధికారంలోకి రావడానికి కూడా ఓవైసీ అనే చెప్పాలి.
"""/"/
ఇదే తరహాలో ఉత్తరప్రదేశ్‌లోనూ బీజేపీ గెలుపునకు ఓవైసీనే ఆప్షన్‌గా కనబడుతోంది.ఈ తరుణంలోనే కాల్పులు జరగడం లాభాన్ని చేకూర్చేలా ఉంది.
దీనిని దృష్టిలో పెట్టుకునే కేంద్ర ప్రభుత్వం ఓవైసీకి జెడ్ కేటగిరి భద్రత కల్పిస్తామంది.
కానీ, దానిని ఓవైసీ నిరాకరించింది.2017 ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేసినా ఒక్క సీటును కూడా కైవసం చేసుకోలేకపోయింది.
ఈసారి ఏకంగా వందస్థానాల్లో అసదుద్దిన్ తమ అభ్యర్థులను బరిలో నిలిపారు.బీహార్, మహారాష్ట్రలో పాగా వేసిన ఎంఐఎం ఈ ఎన్నికలతో యూపీలో జెండా ఎగరేసేందుకు తహతహలాడుతోంది.
ఈ తరుణంలో కాల్పుల ఘటన ఎంఐఎంకు కలిసొచ్చేలా మారిందనేది విశ్లేషకుల అభిప్రాయం.మొత్తానికైతే కాల్పుల ఘటన ఎస్‌పీని నిలువరించేందుకేనన్న అనుమానాలు వ్యక్తం కావడం కొసమెరుపు.
డస్ట్ అలెర్జీ తో బాధపడుతున్నారా.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!