కేటీఆర్ టార్గెట్ ? అస్త్రాలు శస్త్రాలు రెఢీ ?
TeluguStop.com
తెలంగాణకు కాబోయే సీఎం గా గత కొద్ది రోజులుగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరు మారు మోగుతోంది.
తెలంగాణకు కాబోయే సీఎం గా ఆయన పేరు పదే పదే ప్రస్తావనకు వస్తోంది.
పార్టీలోనూ, ప్రజల్లోనూ ఇదే చర్చ జరుగుతోంది.కెసిఆర్ పూర్తిగా తెర వెనుక రాజకీయాలు చేయబోతున్నారని, కేటీఆర్ ను మార్చిలోపు సీఎం కుర్చీలో కూర్చో పెడతారు అనే ప్రచారం ఊపందుకుంది.
దీనికి మరింత బలం చేకూర్చేలా మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం కేటీఆర్ కాబోయే సీఎం అంటూ హడావుడి చేస్తూ వస్తున్నారు.
ఇక ఈ విషయం పై ప్రతి పక్షాలు సైతం క్లారిటీ వచ్చేసినట్లు గా కనిపిస్తోంది.
అందుకే కాంగ్రెస్, బిజెపి సైతం కేటీఆర్ కాబోయే సీఎం అనే విషయాన్ని ప్రస్తావిస్తూ రావడంతో పాటు, పూర్తిగా కేటీఆర్ ను టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేసేందుకు అప్పుడే కసరత్తు మొదలు పెట్టాయి.
అప్పుడే బిజెపి మెల్లిమెల్లిగా విమర్శలు మొదలు పెడుతుండగా, కేటీఆర్ ను ఎప్పుడూ టార్గెట్ చేసుకునే తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ఈ వ్యవహారంపై స్పందించలేదు.
గతం నుంచి కేటీఆర్ లక్ష్యంగా చేసుకుని రేవంత్ విమర్శలు చేస్తూ వచ్చేవారు.ముఖ్యంగా కేసీఆర్ ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణం అని, గ్రీన్ ట్రిబ్యునల్ సైతం ఆశ్రయించారు.
ఈ వ్యవహారంపై పెద్ద వివాదమే నడిచింది.యువకుడు విద్యావంతుడు, రాజకీయ అస్త్ర శస్త్రాలు వదలడంలో ఆరి తేరిన కేటీఆర్ ను ఎదుర్కొనేందుకు అంతే స్థాయిలో ఇప్పుడు రేవంత్ స్కెచ్ వేస్తున్నట్టు తెలుస్తోంది.
"""/"/
కెటిఆర్ సీఎం అనే విషయాన్ని అధికారికంగా ప్రకటించిన తర్వాత ఆయనపై విమర్శలు చేయడంతో పాటు, అనేక ఆరోపణలు దానికి సంబంధించిన ఆధారాలను బయటపెట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం.
ఏది ఏమైనా ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు కేటీఆర్ టార్గెట్ కాబోతున్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది.
ఇది కలా…నిజమా వైరల్ అవుతున్న నటి శోభిత పోస్ట్…. ఏమైందంటే?