టార్గెట్ ‘భోలే’ సక్సెస్..ఇప్పుడు ‘రతికా’ ని బయటకి పంపే ప్లాన్ లో శివాజీ!
TeluguStop.com
బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత ఎవరి గేమ్ వారిదే.సొంతగా నిజాయితీగా ఆడినవాడే చివరికి విన్నర్ గా నిలుస్తాడు.
గ్రూప్ గేమ్స్ ఆడుతూ ఒకరి మీద ఆధారపడే ప్రతీ ఒక్కరు బిగ్ బాస్( Big Boss ) హౌస్ నుండి తొందరగా బయటకి వెళ్ళిపోతారు.
అందుకు రీసెంట్ ఉదాహరణే భోలే.ఇతను బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన కొత్తల్లో చాలా వింతగా అనిపించాడు.
హౌస్ లోకి అడుగుపెట్టిన రోజు నుండే శివాజీ మరియు పల్లవి ప్రశాంత్ భజన చేస్తూ వచ్చాడు.
తనకి గేమ్ మీద ఆసక్తి లేదు, ఉన్నన్ని రోజులు జనాలకు ఎంటర్టైన్మెంట్ ని అందించి వెళ్ళాలి అనుకున్నాడు, అదే చేసాడు.
కానీ శివాజీ ఏమి చెప్తే అదే చేసేవాడు భోలే.శివాజీ ఇలాంటి వాళ్లందరినీ ఒక గ్రూప్ గా ఏర్పాటు చేసి వాళ్ళ గేమ్ ని సర్వనాశనం చేస్తున్నాడు అని అందరికీ అనిపిస్తూ ఉంది.
"""/" /
ప్రిన్స్ యావర్( Prince Yawar ) ఎంత మంచి కంటెస్టెంట్ అనే విషయం మన అందరికీ తెలిసిందే.
ఎలాంటి టాస్కు వచ్చిన కూడా చెలరేగిపోయి ఆడుతూ ఉండేవాడు.ఇతను బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టినప్పుడు ఇతను ఎవరో కూడా జనాలకు తెలియదు.
ఎలాంటి పీఆర్ సపోర్ట్ లేకుండా హౌస్ లోకి వచ్చాడు, తన ఆట ద్వారానే ఇన్ని రోజులు హౌస్ లో కొనసాగాడు.
కానీ ఎప్పుడైతే అతను శివాజీ గ్రూప్ లో చేరాడో అప్పటి నుండి అతని ఆట గ్రాఫ్ తగ్గుతూ వచ్చింది.
ఇక రతికా రీ ఎంట్రీ తర్వాత అయితే ఇతని ఆట గోవిందా గోవిందా అయిపోయింది.
టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలబడాల్సిన వ్యక్తి, గత వారం డేంజర్ జోన్ లోకి వచ్చాడు.
రాబొయ్యే వారాల్లో ఇతను ఎలిమినేట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.ఇక రీ ఎంట్రీ ఇచ్చిన రతికా మొదటి వారం నుండే శివాజీ గ్రూప్ లో జాయిన్ అయ్యింది.
"""/" /
ఎవరికీ రాని రీ ఎంట్రీ అదృష్టం ఈమెకి మాత్రమే వచ్చింది, కానీ ఆమె దానిని అసలు ఉపయోగించుకోవడం లేదు.
టాస్కులప్పుడు నీ కాళ్ళు పెట్టుకుంటా అని బ్రతిమిలాడే రతికా( Rathika Rose ) కి ఈరోజు నామినేషన్ ప్రక్రియ ప్రారంభం అయ్యే ముందు సోఫాజి అలియాస్ శివాజీ కోచింగ్ ఇచ్చాడు.
అంతే ఈమె నామినేషన్స్ లో అర్థం పర్థం లేకుండా ఏదేదో మాట్లాడుతూ రెచ్చిపోయింది.
ఆమె నామినేషన్స్ చూస్తే నవ్వు తప్ప మరొకటి రాదు.ఆమె అలా రెచ్చిపోడానికి కారణం శివాజీనే.
ఇంతలా రెచ్చిపోయిన రతికా, ఈ వారం కూడా ఆట సరిగా ఆడకపోతే ఎలిమినేట్ అవ్వక తప్పదు.
అమర్ చెప్పినట్టు శివాజీ బ్యాచ్ లో ఉన్న వాళ్లందరినీ ఆయన బయటకి పంపిస్తాడు, ఆయన మాత్రమే హౌస్ లో ఉంటాడు అనేది నిజం అయ్యేట్టు ఉంది.
164 అడుగుల లోయలో పడిపోయిన ప్రెగ్నెంట్ టీచర్… చివరికేమైందో తెలిస్తే?