అప్పటి వివాదంపై తారకరత్న రియాక్షన్.. ఎన్టీఆర్ కు పోటీ ఇవ్వలేదంటూ!
TeluguStop.com
తెలుగు సినీ ఇండస్ట్రీ హీరో నందమూరి ఫ్యామిలీ కి మంచి గుర్తింపు ఉంది అన్న విషయం తెలిసిందే.
ఈ నందమూరి ఫ్యామిలీ నుంచి ఇప్పటికే పలువురు హీరోలు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే.
అలా సినీ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వారిలో తారకరత్న కూడా ఒకరు.
మొదటి 2002లో హీరోగా ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు తారకరత్న.
ఈ సినిమా తరువాత పలు సినిమాలు చేసినప్పటికీ అవి సరైన గుర్తింపును తెచ్చి పెట్టలేక పోయాయి.
దానితో హీరోగా నుంచి తన రూటు మార్చి విలన్ గా కూడా నటించాడు.
అలా అమరావతి సినిమాలో విలన్ పాత్రలో నటించి మెప్పించిన తరువాత విలన్ సినిమాలు చేస్తూ కంటిన్యూ అవుతాడు అని అందరూ భావించారు.
కానీ అలా కూడా జరగలేదు.ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరం అయిన తారకరత్న ఈ మధ్యకాలంలో తన కెరీర్ ను మళ్లీ గాడిలో పెట్టే పనిలో పడ్డారు.
ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తారకరత్న పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా తారకరత్న మాట్లాడుతూ.నందమూరి ఫ్యామిలీ నన్ను దూరం పెట్టింది అని అందరూ అనుకుంటున్నారు.
కానీ అందులో ఏ మాత్రం నిజం లేదు. """/"/
తనను మొదటి నుంచి ఎలా అయితే చూసుకుంటున్నారో.
ఇప్పటికీ అలాగే చూసుకుంటున్నారు.కాకపోతే ఎవరు ఏదో రాశారు అని రాసిన ప్రతి విషయాన్ని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయము అంతే అని తెలిపారు.
అలాగే నందమూరి ఫ్యామిలీ లో ఎటువంటి విభేదాలు లేవు అని తెలిపారు తారకరత్న.
అందరూ మా తాత గారు మాకు వందల కోట్ల ఆస్తులు ఇచ్చినట్టుగా చెప్పుకుంటూ ఉంటారు.
కానీ మేము ఎప్పుడూ కూడా మా మధ్యలో ఆ టాపిక్ ను రానివ్వలేదు.
మాకు ఇన్ని కోట్ల మంది ప్రజల అభిమానం దక్కే విధంగా ఆయన చేశారు.
మరి ఇంతకంటే కావాల్సింది ఏముంది అని చెప్పుకొచ్చాడు తారకరత్న.అదేవిధంగా ఎన్టీఆర్ కు పోటీగా నన్ను లాంచ్ చేశారనే ప్రచారం కూడా జరిగింది.
ఆ విషయం ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది కానీ అందులో ఎంత మాత్రం నిజం లేదు అంటూ ఆ వార్తలను ఖండించాడు తారకరత్న.
మయన్మార్‌లో సంస్కృతంలో బోధన .. రాజస్థాన్ ఎన్ఆర్ఐకి ‘ప్రవాసీ భారతీయ సమ్మాన్’