తారకరత్నకు అమ్మానాన్నలతో మాటల్లేవా.. ఆయన ఫ్రెండ్ ఏం చెప్పాడంటే?

తారకరత్న మరణం తర్వాత ఆయన వ్యక్తిగత జీవితం గురించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

వైరల్ అవుతున్న వార్తలలో ఏ వార్తలను నమ్మాలో ఏ వార్తలను నమ్మకూడదో అభిమానులకు అర్థం కావడం లేదు.

అయితే తారకరత్న స్నేహితుడైన సురేష్ అనే వ్యక్తి వైరల్ అవుతున్న వార్తలకు సంబంధించి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు.

తారకరత్న, అలేఖ్యా రెడ్డి మొదటినుంచి లవ్ చేసుకున్నారని ఆయన తెలిపారు.కామన్ ఫ్రెండ్ ద్వారా వాళ్లిద్దరికీ పరిచయం ఏర్పడిందని సురేష్ అన్నారు.

అలేఖ్య గతం పీడకల అని సురేష్ వెల్లడించారు.తారకరత్నను అత్తగారు కొడుకులా చూసుకునేవారని ఆయన తెలిపారు.

అలేఖ్య ఇంట్లో ఒప్పుకున్నారని తారకరత్న ఇంట్లో ఒప్పుకోలేదని సురేష్ అన్నారు.బాలయ్య గారు మాత్రం యాక్సెప్ట్ చేశారని ఆయన తెలిపారు.

తారకరత్న ఫాదర్ యాక్సెప్ట్ చేయలేదని ఆయన చెప్పుకొచ్చారు. """/"/ అలేఖ్యకు ఒక బ్రదర్ ఉన్నాడని సురేష్ అన్నారు.

విజయసాయిరెడ్డి కూతురు, అలేఖ్య క్లోజ్ అని ఆయన తెలిపారు.బాలయ్య బాబాయ్ అంటే తారకరత్నకు ప్రాణమని సురేష్ పేర్కొన్నారు.

పెద్దమ్మాయి అంటే తారకరత్నకు ప్రాణమని సురేష్ చెప్పుకొచ్చారు.పెద్దమ్మాయిని యూఎస్ లో చదివించాలని అనుకున్నారని ఆయన తెలిపారు.

ఫైనాన్షియల్ గా మరీ అంత ఇబ్బంది పడే పరిస్థితులు తారకరత్నకు లేవని సురేష్ అన్నారు.

"""/"/ తారకరత్నకు అప్పులు లేవని హెల్త్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని ఆయన తెలిపారు.

స్మోకింగ్ అలవాటు మాత్రం ఉండేదని సురేష్ తెలిపారు.సిటీలో ఉంటే కచ్చితంగా జిమ్ కు వెళ్లేవారని సమాచారం.

అలేఖ్యతో పెళ్లి తర్వాత తల్లీదండ్రులతో తారకరత్నకు మాటలు ఉన్నా కొంత గ్యాప్ మాత్రం ఉండేదని తెలుస్తోంది.

తారకరత్న స్నేహితుడు సురేష్ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఈరోజు తారకరత్న పుట్టినరోజు కావడంతో అభిమానులు ఆయనను తలచుకుని ఫీలవుతున్నారు.

కంగువా మూవీకి జ్యోతిక రివ్యూ.. భర్త సినిమా కాకపోతే ఆమె ఇలా స్పందించేవారా?