సినిమా ఇండస్ట్రీలో తారకరత్న సక్సెస్ కాకపోవడానికి మూడు కారణాలు
TeluguStop.com
సినిమా ఇండస్ట్రీ లో నందమూరి హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇరవై సంవత్సరాలు అయ్యింది.
ఇన్నాళ్లలో మొదటి సినిమా మినహా మరే సినిమా ఆయనకు కమర్షియల్ గా సక్సెస్ ను తెచ్చి పెట్టలేక పోయింది.
అమరావతి సినిమాలో విలన్ గా నటించిన తారకరత్న కు నంది అవార్డు లభించింది.
హీరో గా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా చాలా సినిమా ల్లో నటించిన తారకరత్న కు కెరీర్ లో చాలా ఫ్లాప్స్ ఉన్నాయి.
ఇండస్ట్రీ లో తారకరత్న ఫ్లాప్ అవ్వడానికి మూడు కారణాలు ఉన్నాయి.ఆ మూడు కారణాల్లో ప్రధానమైన కారణం ఆయన ఎంట్రీ.
తారకరత్న ఎంట్రీ ఇవ్వడంతోనే ఏకంగా 9 సినిమాలు చేస్తున్నట్లుగా ప్రకటించాడు.ప్రపంచ రికార్డు నమోదు చేసే విధంగా ఏకంగా 9 సినిమాలు కమిట్ అయిన తారకరత్న మొదటి సినిమా మినహా ఎక్కువ సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పర్చాయి.
ప్రతి సినిమా కూడా ఆయన స్థాయిని తగ్గిస్తూ వచ్చాయి.అంతే కాకుండా నందమూరి ఫ్యామిలీకి చెందిన హీరో అవ్వడం.
"""/" /
అప్పటికే బాలకృష్ణ మరియు ఎన్టీఆర్ లు ఓ రేంజ్ లో దూసుకు పోతున్న నేపథ్యం లో తారకరత్న అవసరం ఏంటి అంటూ చాలా మంది భావించారు.
అందుకే తారకరత్న యొక్క సినిమా లను నందమూరి అభిమానులు కూడా లైట్ తీసుకున్నారు.
ఇక తన ఇమేజ్ కు తగ్గట్లుగా.తన యొక్క మార్కెట్ కు తగ్గట్లుగా తారకరత్న సినిమా లను ఎంపిక చేసుకోవడంలో.
కథ లను ఎంపిక చేసుకోవడం లో విఫలం అయ్యాడు. """/" /
అందుకే తారకరత్న యొక్క సినీ కెరీర్ సక్సెస్ అవ్వలేదు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్.
తారకరత్న సినీ కెరీర్ లో సక్సెస్ అవ్వకుండానే తిరిగి రాని లోకాలకు వెళ్లాడు.
రాజకీయాల్లో అయినా సక్సెస్ అవ్వాలని భావించిన తారకరత్న కు చేదు అనుభవం ఎదురు అయ్యింది.
వచ్చే ఎన్నికల్లో తారకరత్న అసెంబ్లీకి పోటీ చేయాలని భావించాడు.ఇంతలోనే గుండె పోటుతో తుది శ్వాస విడిచారు.