జిమ్ లో షర్ట్ లేకుండా తారక్…. ఫోటో వైరల్

టాలీవుడ్లో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్.

నందమూరి తారకరామారావు మనవడిగా నందమూరి హరికృష్ణ వారసుడుగా టాలీవుడ్ లోకి అడుగు పెట్టి తక్కువ టైంలోనే ఎక్కువ గుర్తింపు సొంతం చేసుకున్నాడు.

మాస్ సినిమాలతో అల్లాడించిన తారక్ ఆరంభంలో చాలా లావుగా ఉండేవాడు.హీరోగా సినిమాలు చేస్తున్న ఫిట్ నెస్ విషయంలో మాత్రం ఎప్పుడూ శ్రద్ధ చూపించేవాడు కాదు.

అయితే ఒక్కసారిగా తనని తాను మార్చుకొని ఫిట్ నెస్ పై శ్రద్ధ చూపించడం మొదలు పెట్టి భాగా సన్నగా అయిపోయాడు.

అప్పటి నుంచి అదే పర్సనాలిటీ మెయింటేన్ చేస్తూ లుక్ పరంగా పెర్ఫెక్ట్ అవడం మొదలు పెట్టాడు.

టెంపర్ సినిమాలో ఏకంగా షర్ట్ లేకుండా బాడీ చూపించి అందరిని ఆశ్చర్యపరిచాడు.అతని ఫిట్ నెస్ వెనుక ఉన్న వ్యక్తి విదేశీ ఫిట్నెస్ ట్రైనర్ లాయ్డ్ అనే విషయాన్ని గతంలో తారక్ చెప్పుకొచ్చాడు.

ఒకసారి 6 ప్యాక్ లుక్ లోకి మారిపోయాక ఇక తారక్ వెనుదిరిగి చూసిందే లేదు.

లాయ్డ్ అందుబాటులో లేకపోయినా స్థానిక ఫిట్నెస్ ట్రైనర్ల సమక్షంలో తనని తాను తీర్చిదిద్దుకుంటు వచ్చాడు.

తాజగా తన జిమ్ కోచ్ తో కలిసి తారక్ కెమెరాకి ఫోజిచ్చాడు.బైసెప్, ట్రై సెప్, బాడీ షేప్ విషయంలో చాలా జాగ్రత్తలే తీసుకుంటున్నాడని తెలుస్తుంది.

ఆర్ఆర్ఆర్ సినిమాలో తారక్ భారీకాయుడుగా కనిపించాల్సి ఉంది.ఈ నేపధ్యంలో ఈ రకమైన లుక్ లో మంచి ఫిట్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే తారక్ కి సంబందించిన క్యారెక్టర్ టీజర్ ని మరో నాలుగు రోజులలో దర్శక దిగ్గజం జక్కన్న రివీల్ చేయబోతున్నాడు.

ఈ లుక్ ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ఎన్టీఆర్ ఫాన్స్ లో ఆసక్తికరంగా మారింది.

ఎన్నికల వేళ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చెప్పిన వైసీపీ..!!