అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగిన నెటిజన్.. హీరోయిన్ రియాక్షన్ ఇదే!

మామూలుగా అప్పుడప్పుడు హీరో హీరోయిన్లకు సోషల్ మీడియాలో కొన్ని విచిత్రమైన సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి.

ముఖ్యంగా హీరోయిన్లకు ఇలాంటి సంఘటనలు ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి.నెటిజన్స్ వింత వింత ప్రశ్నలు అడిగి వారిని ఆశ్చర్యపరచడంతో పాటు కొన్నిసార్లు షాకులు కూడా ఇస్తూ ఉంటారు.

ముఖ్యంగా అభిమానుల నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు ఏం చెప్పాలో తెలియని అయోమయ పరిస్థితి ఉంటుంది.

తాజాగా అలాంటి పరిస్థితి నటి తాన్యా రవిచంద్రన్‌కు పరిస్థితే ఎదురైంది.ప్రఖ్యాత నటుడు రవిచంద్రన్‌( Ravichandran ) మనవరాలైన తాన్యా రవిచంద్రన్ ఆయన వారసత్వాన్ని తీసుకుని సినీ రంగప్రవేశం చేశారు.

"""/" / ఆమె 2017లో భలే వెళైదేవా అనే చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయ్యారు.

శశి కుమార్‌( Shashi Kumar ) హీరోగా నటించిన ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు.

అయినప్పటికీ తాన్నా రవిచంద్రన్‌కు అవకాశాలు తలుపు తడుతూనే ఉన్నాయి.అలా బృందావనం, కరుప్పన్, నెంజుక్కు నీతి, మాయోన్, అకిలన్‌ వంటి చిత్రాల్లో నటించి తనకుంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.

తాజాగా ఆమె రసవాది( Rasavathi ) అనే చిత్రంలో నటించారు.ఈ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది.

ఈ సందర్భంగా తాన్యా రవిచంద్రన్‌ ఒక భేటీలో అభిమానులతో ముచ్చటించారు.వారితో తన చిత్రాల గురించి.

తాను నటించాలనుకుంటున్న పాత్రల గురించి వివరించారు. """/" / అదే సమయంలో తనకు ఎదురైన విచిత్రమైన ప్రశ్న గురించి చెప్పారు.

ఒకసారి అభిమాని ఒకరు అనూహ్యంగా అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగారు అని ఆమె తెలిపారు.

అతను అడిగిన విధానం తనకు అర్థం కాలేదని, అక్కా అన్నాడు.పెళ్లి చేసుకుంటావా? అని సంబంధమే లేకుండా అడిగిన అతని ప్రశ్నకు బదులేం చెప్పాల్లో తనకు అర్థం కాలేదని ఆమె అన్నారు.

ఇలాంటి ఫన్నీ సంఘటనలు గుర్తొస్తే నవ్వొస్తుందని తాన్యా రవిచంద్రన్‌ తెలిపారు.ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా( Social Media )లో వైరల్ గా మారాయి.