పాదాలతో గిన్నిస్ రికార్డు బద్దలు కొట్టిన మహిళ, అదుర్స్ కదూ!

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల గురించి ఏదో ఒక సందర్భంలో వినే వుంటారు.

మీరు ఏదైనా ఒక విషయంలో ప్రత్యేకతను కలిగిఉంటే ఇక్కడ ట్రై చేసుకోవచ్చు.మంచి పేరు ప్రఖ్యాతలతో పాటు కొంత నగదు కూడా సంపాదించుకోవచ్చు.

ఇక ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అనేవి 1955లో స్టార్ట్ అయ్యాయి.ప్రతి ఏటా ప్రచురించబడే ఒక రిఫరెన్స్ పుస్తకం ఇది.

ఇది మానవ విజయాలు మరియు విపరీతమైన ప్రపంచ రికార్డులను జాబితా అనేదానిని తెలియ జేస్తుంది.

ఈ పుస్తకాన్ని కవల సోదరులు అయినటువంటి నోరిస్ మరియు రాస్ మెక్‌విర్టర్‌లు లండన్‌లోని ఫ్లీట్ స్ట్రీట్‌లో ఆగస్టు 1955లో సహ-స్థాపించారు.

ఇందులో చోటు సంపాదించుకోవాలి అంటే ఏదోఒక విషయంలో చాలా ప్రత్యేకతను కలిగి ఉండాలి.

అయితే గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకోవడం అంటే అంత ఆశమాశి విషయం కాదు.

ప్రపంచంలో ఉన్న అందరిలో కెల్లా మనలో ప్రత్యేకమైన ప్రతిభ దాగి ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యం అవుతుంది.

ప్రపంచ రికార్డును సొంతం చేసుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఒకే విషయంపై ఏళ్ల తరబడి కఠిన సాధన చేస్తూ వుంటారు.

ఇక ఇటీవల కాలంలో ఏకంగా గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు సాధించడం కోసం ఎంతోమంది చిత్ర విచిత్రమైన పనులు చేస్తూ ఉండడం మీరు గమనించవచ్చు.

"""/"/ కొంతమంది అయితే ఏకంగా ప్రాణాలను సైతం రిస్క్ లో పెట్టుకుని మరి వరల్డ్ రికార్డు కోసం ప్రయత్నాలు చేస్తూ వుంటారు.

ఇంకొంతమంది ఏకంగా బాడీలో ఉన్న అవయవాల కారణంగా కూడా వరల్డ్ రికార్డ్ సృష్టిస్తూ ఉండడం గమనార్హం.

తాజాగా ఒక మహిళ ఏకంగా తన కాళ్ల కారణంగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకుంది.

అందరి కాళ్ళతో పోల్చి చూస్తే ఆమె కాళ్ళు ప్రపంచంలోనే చాలా పెద్దవి అని తేలింది.

అందుకే గిన్నిస్ రికార్డుల్లో చోటు సంపాదించుకుంది సదరు మహిళ.అమెరికాకు చెందిన హెర్బర్ట్ అనే మహిళకు కుడి పాదం 33.

1 సెంటీమీటర్లు అంటే 13.03 అంగుళాలు ఉండగా.

ఎడమ పాదం 32.5 సెంటీమీటర్లు అంటే 12.

79 అంగుళాలు వుంది.దాంతో ఆమెను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వరించింది.

అమరావతి పై కీలక నిర్ణయాలు.. ఇక పరుగులే పరుగులు