తానా నుంచీ మరో మహోత్తర కార్యక్రమం “పుస్తక మహోద్యమం”

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని తెలుగు సంఘాలలో తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం ) అతి పెద్దదైన, బలమైన సంస్థగా అవతరించింది.

ముఖ్యంగా అమెరికాలో ఉన్న భారత ప్రవాస సంఘాలు అన్నిటికంటే కూడా తానా అతి పెద్ద సంస్థని చెప్పడంలో సందేహం లేదు.

ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ, ఎంతో మందికి చేయూత నిస్తూ, తెలుగు బాషాభివ్రుద్ది, తెలుగు సంస్కృతీ సాంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు తెలియజేసేలా తానా ఏర్పాటు చేసే ప్రతీ కార్యక్రమం ఎంతో మందికి స్పూర్తిగా నిలిచింది.

తాజాగా తానా ఏర్పాటు చేసిన నూతన ఉద్యమం, మరో మహోన్నతమైన కార్యక్రమం పుస్తక మహోద్యమం.

పుస్తకాలు ఎంతో మందికి దిక్సూచిగా ఉంటాయి, మరెంతో మందికి జీవిత గమ్యాలకు దారి చూపిస్తాయి, కొందరికి నేస్తాలుగా ఉంటాయి.

గతంలో పుస్తక పటనానికి ఎంతో ప్రాధాన్యత ఉండేది కానీ రాను రాను పుస్తక పటనం అనేది కనుమరుగు అవుతోంది.

మళ్ళీ ప్రజల్లో పుస్తకాల మీద ప్రేమను పెంచడానికి, ఆసక్తి కలిగించడానికి తానా నడుం బిగించింది.

ప్రస్తుత కాలంలో సెల్ ఫోన్స్, సోషల్ మీడియాకే ప్రాధాన్యత ఇస్తున్న తరుణంలో పుస్తకాలను స్నేహితులుగా పరిచయం చేయాలంటే ఎవరో ఒకరు ముందుకు రావాలని భావించిన తానా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

ఈ మేరకు తానా మీడియా అధ్యక్షుడు టాగూర్ మాలినేని మాట్లాడుతూ దసరా నుంచీ సంక్రాంతి వరకూ నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా పుస్తకాలు కొని వాటిని మీ భంధువులు, మిత్రులకు, ప పిల్లలకు బహుమతిగా ఇవ్వడం ద్వారా పుస్తక పటనం పై ఆసక్తి కలుగుతుందని, తమ లక్ష్యం కూడా ఇదేనని ప్రకటించారు.

అయితే ఈ పుస్తకాలు ఇచ్చే సమయంలో ఒక ఫోటో దిగి , పేరు, ఊరి పేరు, ఫోన్ నెంబర్ , పుస్తక రచయిత పేరు, పుస్తకం పేరు, పుస్తక గ్రహీత పేరు, వారి ఊరు వివరాలు తానా వెబ్సైటు లో అప్లోడ్ చేయాలని కోరింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి పుస్తక నేస్తం అనే ప్రశంసా పత్రం అందిస్తారని తెలిపారు.

ట్రైకోడెర్మా విరిడి తో పంటలకు ఆశించే తెగుళ్ళకు చెక్..!