అమెరికాలో పేదలకు తానా సాయం..!!

పట్టెడన్నం కోసం మనిషి చేయని పనులు ఉండవు, ఎలాంటి వృత్తి చేసిన, రోజు ఎంత కష్టపడి పనిచేసినా అందరూ ఆ రెండు ముద్దల కోసమే, ఆకలి తీర్చుకోవడం కోసమే పనిచేస్తారు.

కానీ చేయడానికి పని దొరకక, ఎలాంటి పనులు లేక చేతిలో చిల్లిగవ్వ ఉండక పస్తులు ఉండాల్సి వస్తే ఆ భాద నరకం కంటే ఘోరంగా ఉంటుంది.

అలాంటి సమయంలో కడుపు నిండా అన్నం పెట్టి సాయం చేసే వాళ్ళు కనపడితే వాళ్ళు దేవుళ్ళతోనే సమానం.

ఇప్పుడు అమెరికాలో పలు తెలుగు సంఘాలు నిరుపేదల ఆకలి తీర్చే పనిలో పడ్డాయి.

ఈ క్రమంలోనే అమెరికాలో తెలుగు సంఘాలలో అతి పెద్ద తెలుగు సంస్థగా పేరొందిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా కరోనా కారణంగా ఉద్యోగాలు , పనులు కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న పేదవారి ఆకలి తీర్చేలా ఫుడ్ డ్రైవ్ చేపట్టింది.

తమ వంతుగా సాయంగా పేద వారి ఆకలి తీర్చడానికి కరోనా మొదలైన రోజు నుంచీ పలు రాష్ట్రాలలో తానా సభ్యులు ఈ కార్యక్రమం చేపడుతున్నారని తెలిపింది.

ఉద్యోగాలు కోల్పోవడంతో ఉన్నతంగా బ్రతికిన వారు కూడా ఇప్పుడు ఆకలితో అలమటిస్తున్నారని అలాంటి వారి ఆకలి తీర్చడానికి తానా ఎప్పుడు ముందుంటుందని తానా కమ్యునిటీ కో ఆర్డినేటర్ మల్లి వేమన తెలిపారు.

పేదలకు ఆహారాన్ని అందించడం కోసం సుమారు లక్ష డాలర్ల విలువైన ఆహార పదార్ధాలు అందించనున్నామని తెలిపారు నిర్వాహకులు.

నవంబర్ -14 న మొదలైన ఈ కార్యక్రమం డిసెంబర్ -31 వరకూ కొనసాగుతుందని తెలిపారు.

తెలుగు రాష్ట్రాలలో కూడా తానా తరుపున ఎంతో మందికి సాయం అందించామని అమెరికాలో కూడా దాదాపు అన్ని రాష్ట్రాలలో తానా తరుపున ఈ కార్యక్రమమం చేపడుతున్నామని, ఇందుకు సహకరించిన ప్రతీ తానా సభ్యులకు తానా అధ్యక్షుడు జయ్ తాళ్ళూరి కృతజ్ఞతలు తెలిపారు.

దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి.. కడియంకు మాజీ ఎమ్మెల్యే రాజయ్య సవాల్