సాక్ష్యాలను తారుమారు చేయడం నేరమే..: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
TeluguStop.com
ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో కవిత పేరు లేకుంటే విచారణకు వెళ్లాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
రూ.100 కోట్ల వ్యవహారంలో కవిత పాత్ర ఉందని ఈడీ తేల్చిందన్నారు.
ఒకవేళ కవిత పాత్ర లేకుంటే పది ఫోన్లను ఎందుకు ధ్వంసం చేశారని ఆయన ప్రశ్నించారు.
సాక్ష్యాలను తారుమారు చేయడం నేరమేనని పేర్కొన్నారు.రాష్ట్ర హక్కుల సాధనలో కేసీఆర్ విఫలమైయ్యారని విమర్శించారు.