గాలోడు సినిమాలో సుధీర్ కష్టం కనిపించింది.. తమ్మారెడ్డి కామెంట్స్ వైరల్!

బుల్లి తెరపై కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్ సుడిగాలి సుదీర్ ప్రస్తుతం వెండితెరపై కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.

ఈయన హీరోగా పలు సినిమాలలో నటించిన పెద్దగా గుర్తింపు రాలేదు.తాజాగా రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వంలో ఆయన సొంత నిర్మాణంలోనే తెరకెక్కిన గాలోడు సినిమా సుధీర్ కు ఎంతో మంచి విజయాన్ని అందించింది.

ఇక ఈ సినిమా నాలుగు రోజులుగా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లను కూడా రాబడుతుంది.

ఇక ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో ఈ సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ కూడా పాల్గొన్నారు.ఈయన కూడా ఈ సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే.

ఇక ఈ విషయం గురించి తమ్మారెడ్డి మాట్లాడుతూ.ఈ సినిమాలో ఓ చిన్న పాత్ర ఉంది మీరు నటించాలనీ దర్శకుడు నా వద్దకు వచ్చారు.

అయితే ఈ సినిమా టైటిల్ బాలేదని నేను రిజెక్ట్ చేసాను. """/"/ ఇక డైరెక్టర్ బలవంతం చేయడంతో ఆ సీన్ కోసం ఒప్పుకున్నానని అయితే నాపై సీన్ షూట్ చేసే సమయంలోనే ఈ సినిమాలో ఏదో మ్యాజిక్ ఉంది తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అవుతుందని ఆ రోజే అనుకున్నాను.

ఈ సినిమాలో కష్టాన్ని నమ్ముకున్న వాడికి అదృష్టం కలిసి వస్తుందనే డైలాగ్ ఉంది.

ఈ సినిమాలో హీరోగా నటించిన సుధీర్ కూడా తన కష్టాన్ని నమ్ముకోవడం వల్లే ఈరోజు సక్సెస్ అందుకున్నారు.

ఈయన కూడా అల్లు అర్జున్ ఎన్టీఆర్ వంటి వారిలాగా కష్టపడే తత్వం తనలో కనిపించిందని, నేను ఆయన పై పొగడ్తలు కురిపించలేదు నిజం మాట్లాడుతున్నాను అంటూ ఈ సందర్భంగా సుధీర్ నటించిన గాలోడు సినిమా పై తమ్మారెడ్డి ప్రశంసలు కురిపించారు.

ఈ ఆమ్లా జ్యూస్ ను వారానికి 2 సార్లు తీసుకున్న బోలెడు ఆరోగ్య లాభాలు!