కేసీఆర్ మాట‌లు... స్టాలిన్ చేత‌లు ! అరుదైన సీన్ !

తెలంగాణ సీఎం కేసీఆర్‌, త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్ ఇద్ద‌రు దిగ్గ‌జ నేత‌లు.బ‌ల‌మైన ప్ర‌జాక‌ర్ష‌ణ‌తోపాటు పాల‌న‌లో త‌మ‌దైన ముద్ర వేసుకున్నారు.

తాజాగా వీరిద్ద‌రు భేటీ అయ్యారు.ప‌లు అంశాల‌పై చ‌ర్చించుకున్నారు.

ఢిల్లీ రాష్ట్ర ప్ర‌భుత్వం కేజ్రీవాల్ అమ‌లు చేస్తున్న విద్యావిధానం, ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన ప‌నుల గురించి తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశారు.

మ‌రోవైపు కేజ్రీవాల్ ప్ర‌భుత్వం అనేక ప‌నులు చేసిందా అనిపించ‌క మాన‌దు.ఢిల్లీలో ఆప్ అధికారంలోకొచ్చిన త‌రువాత ప్ర‌భుత్వ విద్యావ్య‌వ‌స్థ‌లో సంచ‌ల‌నాత్మ‌క మార్పులు తీసుకొచ్చారు.

ఈ-మోడ‌ల్‌పై ప‌లు రాష్ట్రాలు సైతం ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నాయి.ఇక కేసీఆర్ లాంటి సీఎంలు వారి మంత్రులు, అధికారుల‌ను ఢిల్లీ వెళ్లి ఆరా తీయ‌మంటున్నారు.

అయితే త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ మాత్రం తానే స్వ‌యంగా ఢిల్లీకి వెళ్లి కేజ్రీవాల్‌తో భేటీ అయ్యారు.

ఢిల్లీ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న విద్యావిధానాన్ని, ఆరేండ్ల‌లో రాష్ట్ర బ‌డ్జెట్‌లో 25శాతం నిధులు విద్యారంగానికి ఖ‌ర్చు చేయ‌డం లాంటి వాటిపై చ‌ర్చించారు.

కాగా 2014-15లో ప్ర‌యివేటు పాఠ‌శాల‌ల‌తో పోలిస్తే ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ల‌స్ టూ(ఇంట‌ర్ సెకండ్ ఇయ‌ర్‌) ఉత్తీర్ణ‌త శాతం త‌క్కువ‌గా ఉండేద‌ని, కానీ, 2019-20నాటికి 98శాతానికి పెంచిన‌ట్టు కేజ్రీవాల్ వెల్ల‌డించార‌ట‌.

స్పందించిన స్టాలిన్ కూడా ఢిల్లీ మాద‌రిగా త‌మిళ‌నాడులోనూ ఢిల్లీ మోడ‌ల్ స్క‌ళ్ల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్టు చెప్పారు.

త‌మిళ‌నాడులో త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకొచ్చిన త‌రువాత విద్య‌, వైద్య రంగానికే అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్టు స్టాలిన్ తెలిపారు.

"""/"/ ఇక ఢిల్లీ త‌ర‌హా స్కూళ్ల‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని, అవి పూర్తి కాగానే కేజ్రీవాల్‌ను త‌మిళ‌నాడుకు ఆహ్వానిస్తామ‌ని చెప్పార‌ట‌.

ఇప్పుడు స్టాలిన్ తీరు ఆస‌క్తిక‌రంగా మారింది.సీనియ‌ర్ నేత‌, ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్నా కూడా వేరే రాష్ట్ర ప్ర‌భుత్వ విధానాల‌ను బహిరంగంగా పొగ‌డ‌డం అరుదైన విష‌య‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

మొత్తంగా తెలంగాణ సీఎం కేసీఆర్ త‌ర‌చూ కేజ్రీవాల్‌తో భేటీ అవుతాన‌ని చెబుతూ వ‌చ్చాడు.

కానీ, భేటీ అయిన దాఖ‌లాలు లేవు.కానీ, త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ ఏదీ చెప్ప‌కుండానే తానే స్వ‌యంగా ఢిల్లీకి వెళ్లి కేజ్రీవాల్‌తో భేటీ కావ‌డం పొగ‌డ‌డం జ‌రిగిపోయాయి.

దీంతో ఓ అరుదైన‌సీన్ ఆవిష్కృతమైంద‌ని టాక్‌.

వైరల్: జకార్తా వీధుల్లో నాగుపాము మాంసంతో వంటకాలు.. ధర తెలిస్తే దిమ్మతిరుగుద్ది!