రూ.2 వేల కోసం తల్లిని దారుణంగా?

కన్నతల్లి కంటే ఆ ముర్కులకు డబ్బులే ఎక్కువ అయ్యాయి.2 వేల రూపాయిల కోసం కన్నతల్లిని దారుణంగా హతమార్చారు.

ఈ దారుణ ఘటన తమిళనాడులోని చోటుచేసుకుంది.పూర్తి వివరాల్లోకి వెళ్తే.

తమిళనాడులోని ఈరోడ్‌ నగరంలోని సూరంబట్టి ప్రాంతానికి చెందిన మహిళ కొద్దీ కాలం క్రితం భర్తను పోగొట్టుకుంది.

దీంతో తన ఇద్దరు కొడుకులు విఘ్నేష్, అరుణ్ కుమార్ తో కలిసి జీవిస్తోంది.

అయితే పెద్ద కొడుకు డ్రైవర్ గా, చిన్న కొడుకు ప్లంబర్ గా పనిచేస్తున్నారు.

కానీ ఇద్దరు ఇటీవల కాలంలో మద్యానికి బానిసలయ్యారు.దీంతో నిత్యం పనులు మనిషి ఎప్పుడు తాగుతూనే ఉండేవాళ్ళు.

ఇంకా ఈ నేపథ్యంలోనే గత మంగళవారం విఘ్నేష్‌, అరుణ్‌కుమార్‌ మద్యం మత్తులో ఇంటికి చేరారు.

ఇంట్లో దాచిన రెండు వేల రూపాయిల కోసం వెతికారు.అయితే ఎంత వెతికిన డబ్బులు కనిపించకపోవడంతో తల్లిని ఆ డబ్బు గురించి అడగగా ఇంటి ఖర్చు కోసం డబ్బు తీసినట్టు ఆమె చెప్పింది.

మద్యం కోసం దాచిన డబ్బులను ఇలా ఖర్చు చేస్తావా అంటూ ఆమెని దారుణంగా ఇనుప రాడ్లతో చితకబాదారు.

ఆమె కేకలు విన్న స్థానికులు ఆమెను రక్షించారు.మత్తు నుంచి తేరుకున్న అన్నదమ్ములిద్దరూ తల్లిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించగా ఆమె మార్గం మద్యలోనే మృతి చెందింది.

దీంతో ఆమెను గ్రామశివారులో ఉన్న శ్మశానంలో ఆమె మృతదేహాన్ని పూడ్చి పెట్టేందుకు ప్రయత్నించగా సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్ట్ చేశారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి3, శుక్రవారం 2025