ఫ్యాన్స్ చేసిన పనికి తలపట్టుకుంటున్న తమిళ హీరో విజయ్!
TeluguStop.com
అప్పుడప్పుడు అభిమానులు చేసే పనులకు హీరోలు చిక్కులలో పడుతుంటారు.మితిమీరిన అభిమానం వల్ల ఇలాంటివి జరుగుతుంటాయి.
తాజాగా ఇలాంటి పరిస్థితిని విజయ్ తన ఫ్యాన్స్ వల్ల ఎదుర్కోవాల్సి వచ్చింది.మరి ఆ సంగతులు ఏంటో ఇప్పుడు చూద్దాం.
తమిళనాడులో రజనీకాంత్ తర్వాత మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో విజయ్ దళపతి ముందుంటాడు.
ఈయన రాజకీయాలలోకి వస్తారనే ప్రచారం అక్కడ చాలా రోజుల నుండి జరుగుతుంది.అయితే తాజాగా కాంచీపురంలో
నటుడు దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్ నటించిన చిత్రాల్లోని గెటప్‌లలో విజయ్ ముఖాలను పెట్టిన పోస్టర్లు హల్‌చల్ చేశాయి.
ఈ పోస్టర్‌లో మక్కల్ తిలకంకు మరో రూపమే విజయ్ దళపతి అని పేర్కొన్నారు.
అంతేకాకుండా వాటిలో మీరు రాజకీయాల్లోకి వస్తే అన్నాదురై లేకుంటే పెరియార్ అని రాసి ఉంది.
ఇప్పుడా ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.2021 ప్రథమ భాగంలో తమిళనాడు శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి.
ఈ ఎన్నికలలో పోటీ చేయడానికి కమల్ హాసన్ తన పార్టీని సిద్ధం చేస్తున్నారు.
అలాంటి నేపథ్యంలో విజయ్ గురించి ఇలాంటి పోస్టర్లు దర్శనమివ్వడంతో ఆయన కూడా ఈ ఎన్నికలలో పోటీ చేస్తారనే ప్రచారం ప్రస్తుతం అక్కడ పెద్ద ఎత్తున జరుగుతుంది.