తండ్రి సమాధి ఇంట్లోనే కట్టాడు.

తమిళనాడులోని పెరంబలూర్‌ జిల్లాలో ఓ కొడుకు తన తండ్రి చివరికోరిక తీర్చినందుకు పోలీసులు అతనితో పాటు అతన్ని కుటుంబం మొత్తాన్ని అరెస్ట్ చేశారు.

వివరాలలోకి వెళ్తే అమ్మాపాళయం సమీపంలో ఉన్న కలరంపట్టి గ్రామంలో నివాసముంటున్న 67ఏళ్ళ రైతు రామస్వామి అనారోగ్య కారణంగా సోమవారం మరణించారు.

ఆయన మరణించే ముందు తనని ఇంట్లో సమాధి చేయాలని ఇదే తన చివరి కోరికని అక్కడున్న తన బంధువులతో చెప్పారు.

తండ్రి మరణం విషయం తెలుసుకున్న కుమారుడు బాలకృష్ణన్‌ అతని స్వగ్రామానికి చేరుకున్నాడు.

తండ్రి కోరిక చివరి కోరికను రామస్వామి బంధువులు ఆయన కుమారుడికి తెలియజేశారు.దానితో బాలకృష్ణన్‌ ఇంటి ప్రాంగణంలో ఆయన పార్థివ దేహాన్ని పూడ్చడానికి గుంత తవ్వాడు.

ఇది గమనించిన స్థానికులు ఇందుకు అభ్యంతరం చెప్పడంతో బాలకృష్ణన్‌ తన తండ్రి పార్థివ దేహాన్ని ఇంట్లో ఖననం చేశారు.

స్థానికుల నుండి సమాచారం అందుకున్న పోలీసులు, తహసిల్దారు వెంటనే అక్కడికి చేరుకున్నారు.రామస్వామి బంధువులకు నచ్చచెప్పడానికి ప్రయత్నించారు కానీ వారు ఎంత సేపటికి ఒప్పుకోకపోగా వాగ్వాదానికి దిగడంతో చేసేదేమీ లేక వారందరినీ అరెస్ట్ చేసి ఆ శవాన్ని స్మశానవాటికకు తీసుకెళ్లి ఖననం చేశారు .

ఎన్టీఆర్, నీల్ కాంబో మూవీ బ్యాక్ డ్రాప్ ఇదేనా.. భారీ రిస్క్ కు సిద్ధమయ్యారుగా!