మరో సినిమాతో రెడీ అయిపోయిన స్టార్ హీరో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ
TeluguStop.com
తమిళ స్టార్ హీరో విక్రమ్ ఇటీవలే కొడుకు తో కలిసి మహాన్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
తమిళ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం లో రూపొందిన ఆ సినిమా కు అమెజాన్ లో పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది.
తెలుగు వెర్షన్ విడుదల అయినప్పటికీ జనాలు పెద్దగా పట్టించుకోలేదు.విక్రమ్ సినిమాలు ఒకప్పుడు తెలుగు లో మంచి వసూళ్లను దక్కించుకున్నాయి.
కానీ ఇప్పుడు మాత్రం ఆయన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఆదరించడం లేదు.
అయినా కూడా నటించిన ప్రతి ఒక్క సినిమాను కూడా తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రస్తుతం విక్రమ్ కోబ్రా సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.
భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా కు అజ్ఞాన ముత్తు అజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు.
"""/" /
ఈ సినిమా కు ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ నేపథ్యం లో అంచనాలు భారీ ఎత్తున ఉన్నాయి.
శ్రీనిధి శెట్టి మరియు మృణాళిని హీరోయిన్స్ గా నటించారు.ఒకప్పటి టీమిండియా స్టార్ ఆల్రౌండర్ అయిన ఇర్ఫాన్ పఠాన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించ బోతున్నాడు.
విక్రమ్ సినిమా అంటే కచ్చితంగా ప్రత్యేకత ఉంటుంది.కనుక ఈ సినిమాలో కూడా ప్రత్యేక అంశాలు చాలా ఉన్నాయని యూనిట్ సభ్యులు అంటున్నారు.
తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.అతి త్వరలోనే ఈ సినిమా ని విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు.
విక్రమ్ అభిమాను లు గత రెండేళ్లు గా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నట్లుగా చెబుతున్నారు.
తమిళ్ తో పాటు తెలుగు లో కూడా అదే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు కోబ్రా ను అతి త్వరలోనే తీసుకు రాబోతున్నారు.
పెళ్లికూతురు చీరలో శోభిత.. చైతన్య శోభిత కలకాలం సంతోషంగా ఉండాలంటూ?