వైరల్: వెరైటీ గిఫ్ట్ ను కొత్త దంపతులకు అందజేసిన కమెడియన్..!

ప్రస్తుతం మన దేశంలో బంగారం మాదిరిగా పెట్రోల్ ధరలు విపరీతంగా రోజురోజుకి పెరిగిపోతున్నాయి.

బంగారం లేకున్నా మనిషి జీవనం కొనసాగించవచ్చు.కానీ పెట్రోల్ లేకపోతే వాహనం కదలదు.

వాహనం కదలకపోతే మనిషి కదలలేడు కదా.పెరుగుతున్న పెట్రోల్ ధరలు మధ్య తగరగతి వారిపై గుది బండలాగా మారుతున్నాయి.

పెట్రోల్‌ ధర ఇప్పుడు రూ.110కి చేరువగా ఉంది.

కొన్ని కొన్ని చోట్ల పెట్రోల్ ధరలను తగ్గించాలని నిరసనలు కూడా వెల్లువెత్తుతున్నాయి ఈ క్రమంలో ఓ ప్రముఖ హాస్య నటుడు పెట్రోల్‌ ధరల పెరుగుదలపై సరికొత్త పద్దతిలో నిరసనను తెలిపారు.

ఆ నిరసన ఎలాగో తెలిస్తే మీరు కడుపుబ్బా నవ్వడం గ్యారంటీ.ఇంతకీ ఆ కామెడి నటుడు ఏమి చేసాడో తెలుసా.

? సాధరణంగా మనం పెళ్ళి ఫంక్షన్ కి గాని రిసెప్షన్ కి గాని వెళితే నూతన వధూవరులకు ఏదన్నా గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాము కదా.

కానీ ఓ నటుడు మాత్రం గిఫ్ట్ కింద రెండు పెట్రోల్ డబ్బాలను నూతన వధూవరులకు గిఫ్ట్ గా ఇచ్చాడు.

ఏంటి షాక్ లో ఉన్నారా.? అవునండి నిజంగానే.

అసలు వివరాల్లోకి వెళితే.తమిళ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ హాస్య నటుడు మయీల్‌ సామి.

ఈయన ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను నవ్వించారు.అయితే తాజాగా ఇటీవల మయిల్‌ సామి ఒక వివాహ కార్యక్రమానికి వెళ్ళాడు.

ఆ నవదంపతులను మనసారా ఆశీర్వదించి గిఫ్ట్ కింద 2 పెట్రోల్ డబ్బాలను అందించాడు.

దీంతో ఒక్కసారిగా నవ దంపతులతో పాటు బంధువులు కూడా ఆశ్చర్యపోయి షాక్ నుంచి తేరుకుని నవ్వడం మొదలుపెట్టారు.

ఇంకేముంది ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. """/"/ మయీల్‌ సామి పెట్రోల్ ధరల పెంపుపై చేసిన వినూత్న నిరసనను అందరూ అభినందిస్తున్నారు.

ఈ ఫొటోలను చూసి తమిళ కాలమిస్ట్‌ మనోబాల విజయబాలన్‌ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

నటుడు మయీల్‌ సామి మీడియాతో మాట్లాడుతూ.పెట్రోల్‌ ధరల పెంపును నిరసిస్తూ ఇలా పెళ్లి కానుకగా తాను పెట్రోల్‌ ఇచ్చినట్లు తెలిపారు.

పెట్రోల్‌, డీజిల్‌ ధరలను రూ.3 తగ్గించిన సీఎం స్టాలిన్‌ నిర్ణయాన్ని ఆయన అభినందించారు.

ఎంతయినా మయూల్ కామెడీ స్టార్ కదా.ఏ పని చేసిన అందులో కామెడీ ఉండాలిసిందే అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

విడాకులు తీసుకుంటే తప్పేం కాదు… పెళ్లికి నేను వ్యతిరేకం కాదు…సదా షాకింగ్ కామెంట్స్!