Tamil Sai Soundara Rajan : ప్రత్యక్ష ఎన్నికల్లో కి తమిళ ‘ సై ‘ … పోటీ అక్కడి నుంచేనా ? 

తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళ సై సౌందర రాజన్( Tamil Sai Soundara Rajan ) ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.

తెలంగాణ గవర్నర్ గా నాలుగున్నర ఏళ్ల పాటు పనిచేసిన తమిళ సై పాలన లో తనదైన ముద్ర వేశారు .

ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ అన్నట్లుగా వివాదం నడిచింది.2019 సెప్టెంబర్ లో తెలంగాణ గవర్నర్ ( Governor Of Telangana )గా తమిళసై బాధ్యతలు స్వీకరించారు.

  ఈ సందర్భంగా గవర్నర్ కు ఉన్న అన్ని అధికారులను ఉపయోగించుకున్నారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో తమిళ సై వ్యవహరించిన తీరు సంచలనమే రేపింది.

కేసీఆర్ ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించడం లేదని బహిరంగంగానే విమర్శలు చేశారు.ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు విషయంలో ఆమె అడ్డు చెప్పడం,  కీలక బిల్లులను పెండింగ్ లో పెట్టడం వంటివన్నీ అప్పటి బీఆర్ఎస్( BRS ) ప్రభుత్వానికి ,గవర్నర్ Ku మధ్య వివాదాన్ని రేపాయి.

కీలకమైన బిల్లుల ఆమోదం విషయంలో గవర్నర్ నెలలు తరబడి పెండింగ్ లో పెట్టడం వంటి వాటిపై గవర్నర్ తీరును తప్పుబడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

"""/" / ముఖ్యంగా గవర్నర్ కోట ఎమ్మెల్సీ నియామకాలు విషయంలో గవర్నర్ పేరు వివాదాస్పదంగా మారింది.

బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించిన దాసోజు శ్రవణ్,  కుర్ర సత్యనారాయణ( Dasoju Shravan, Kurra Satyanarayana ) ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను గవర్నర్ తిరస్కరించడం, కాంగ్రెస్ ప్రతిపాదించిన కోదండరాం అభ్యర్థిత్వానికి ఆమోదం తెలపడం వంటివన్నీ వివాదం రేపాయి.

ఇక అవకాశం దొరికినప్పుడల్లా కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా గవర్నర్ వ్యవహరించారు .

భద్రాచలం రాముడు గుడికి వెళ్లేందుకు హెలికాప్టర్ ను ప్రభుత్వం సమకూర్చలేదని , రైలులో వెళ్లి వచ్చి సంచలనం రేపారు.

రాజ్ భవన్ లోనే ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం,  వరదల సమయంలో నేరుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం వంటివన్నీ గత బిఆర్ఎస్ ప్రభుత్వానికి ఇబ్బందులే కలిగించాయి .

గవర్నర్ బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారు అంటూ బీఆర్ఎస్ బహిరంగంగానే విమర్శలు చేసేది.

"""/" /  ఇది ఇలా ఉంటే గతంలో తమిళనాడు బిజెపి అధ్యక్షురాలుగా తమిళ సై పనిచేశారు.

మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టాలనే ఉద్దేశంతోనే తెలంగాణ గవర్నర్ పదవికి ఆమె రాజీనామా చేసినట్లు సమాచారం .

తమిళ సై రాజీనామాను గవర్నర్ కార్యాలయం కూడా ధ్రువీకరించింది .వృత్తిరీత్యా గైనకాలజిస్ట్ అయిన తమిళసై బిజెపి సిద్ధాంతాలకు ఆకర్షితులై 1999లో ఆ పార్టీలో చేరారు.

ఆ తర్వాత అనేక ఎన్నికల్లో ఆమె పోటీ చేసినా ఓటమి చెందారు.  ఇప్పుడు మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు.

తమిళ సై  తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేయడంతో,  కొత్తగా తెలంగాణ గవర్నర్ గా జార్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు.

ఓయమ్మో.. ముఖం కూడా చూడకుండనే లేడీ ఖైదీని గర్భవతిని చేసిన మగ ఖైదీ