తమిళనాడు విద్యార్థులు చేసిన నానో ఉపగ్రహ ప్రయోగానికి సర్వం సిద్ధం!
TeluguStop.com
తమిళనాడుకు చెందిన నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ లోని ముగ్గురు యువకులు ఎక్సపెరిమెంటల్ సాటిలైట్ ను తయారుచేసి అంతరిక్షానికి పంపడానికి నిర్ణయించుకున్నారు.
తంతోన్రిమలైకు చెందిన ఎం అద్నాన్, నాగంపల్లికు చెందిన ఎం కేసవన్, తెన్నిలైకు చెందిన వి అరుణ్ తమిళనాడు లోని చెన్నై లో చదువుకున్నారు.
వీరిని స్పేస్ కిడ్స్ ఇండియా అనే సంస్థ సరైన ప్రోత్సాహం అందించింది.హిందూ పత్రిక ప్రకారం వీళ్ళు 11వ తరగతిలో ఈ ప్రయోగం ప్రారంభించారు.
ప్రపంచంలో అతి చిన్న మరియు తేలికైన టెక్నాలజీ సాటిలైట్ ను రూపొందించడమే వీరి లక్ష్యం.
రీఇన్ఫోర్స్ గ్రఫీన్ పాలిమర్ కలిగిన ఈ సాటిలైట్ 3 Cm విస్తీర్ణం మరియు 64gm ల బరువు కలిగి ఉంటుంది.
ఈ సాటిలైట్ చిన్నగా ఉన్నా అంతరిక్షం నుండి భూమి మీదకు సిగ్నల్ పంపడానికి దీనిలో రేడియో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేటర్ ఉంది.
సాటిలైట్ కు అవసరమైన విద్యుత్ ఉత్పత్తి చేసే సోలార్ పరికరం కూడా దీనిలో ఉంది.
ఇండియన్ సాట్ అని పిలిచే ఈ సాటిలైట్ ను జూన్ లో అంతరిక్షానికి పంపనున్నారు.
సమ్మర్ లో తలనొప్పికి కారణాలేంటి.. రిలీఫ్ పొందడం ఎలా?