బీస్ట్ కు మరో ఎదురు దెబ్బ.. తమిళ్ లో కూడా నిషేదించాలని డిమాండ్..

కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ దళపతి కి ఎంత ఫాలోయింగ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఈయనకు తమిళ్ లో రజనీకాంత్ తర్వాత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకుని అక్కడ ప్రజల చేత సూపర్ స్టార్ గా పిలిపించు కుంటున్నాడు.

ఈయన సినిమా లంటే అక్కడి ప్రేక్షకులు పడి చచ్చిపోతారు.ఈయన గత సినిమా మాస్టర్ 200 కోట్లు వసూలు చేసి కోలీవుడ్ లో సంచలనం నమోదు చేసింది.

ఇక ఇప్పుడు ఈయన బీస్ట్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది.

ఈ సినిమాను వేగంగా పూర్తి చేసి రిలీజ్ కు కూడా రెడీగా ఉంచారు.

ఈ సినిమాను కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కించాడు.సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమాను ఏప్రిల్ 13న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.

"""/"/ ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతుంది.అయితే ఈ సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో అందరికి తెలుసు.

అయితే విజయ్ సినిమా కు వరుసగా ఎదురు దెబ్బలు తగులు తున్నాయి.మొన్నటికి మొన్న ఈ సినిమా ముస్లిమ్ వాళ్లకు వ్యతిరేకంగా ఉందని కువైట్ లో ఈ సినిమాను నిషేదించారు.

ఇక ఇప్పుడు ఈ సినిమాను సొంత రాష్ట్రము అయిన తమిళ్ నాడులోనే వ్యతిరేకత వచ్చింది.

ముస్లిమ్ వాళ్లను టెర్రరిస్టులుగా చూపిస్తున్నారని బీస్ట్ ను బ్యాన్ చేయాలనీ కోరుతూ తమిళనాడు ముస్లిం లీగ్ హోంశాఖ కార్యదర్శికి లేఖ రాసింది.

అక్కడి ముస్లిం లు ఈ సినిమాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.ముస్లిం లను ఇప్పటికి తీవ్రవాదులుగా చిత్రీకరించడం బాధా కరమైన విషయం అని లేఖలో పేర్కొన్నారు.

మరి సొంత రాష్ట్రంలోనే ఇలా వ్యతిరేకత రావడం విజయ్ కు షాక్ అనే చెప్పాలి.

కెనడా, చైనా, మెక్సికోలకు షాక్ .. సుంకాల పెంపుకు ట్రంప్ సిద్ధం?